ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థికి మాయావతి మద్దతు

ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థికి మాయావతి మద్దతు

బహుజన్ సమాజ్ పార్టీ చీఫ్ మాయావతి ఎన్డీయే ఉపరాష్ట్రపతి అభ్యర్థి జగదీప్ ధన్ కర్ కు తమ పార్టీ తరపునుంచి మద్దతు ప్రకటించారు. దేశంలో ఎంతో అత్యున్నతమైనదిగా భావించే రాష్ట్రపతి పదవి ఎన్నికల్లో ప్రతిపక్షాలకు, ప్రభుత్వానికి ఏకాభిప్రాయం కుదరకపోవడంతో ఇటీవలే ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ప్రజాప్రయోజనాల దృష్ట్యా తాను జగదీప్ ధన్ కర్ కు మద్దతివ్వాలని నిర్ణయించుకున్నట్టు మాయావతి తెలిపారు.

ఉపరాష్ట్రపతి పదవికి ఆగష్టు 6న ఎన్నికలు జరగనున్నాయి. కాగా ప్రస్తుతం ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు పదవీ కాలం ఆగష్టు 10తో ముగియనుంది. ఇకపోతే నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్డీఏ) ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా జగదీప్ ధన్ కర్ ను ప్రకటించగా.. ప్రతిపక్ష పార్టీలు మార్గరేట్ అల్వా పేరును అనౌన్స్ చేశాయి. ఇదిలా ఉండగా త్వరలో జరగబోయే ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ ఓటింగ్ కు దూరంగా ఉంటుందని ఇప్పటికే ప్రకటించింది.