ఈసారి కేంద్ర బడ్జెట్..ఆదివారం ..ఫిబ్రవరి 1న బడ్జెట్ ప్రవేశపెట్టనున్న మోదీ సర్కార్!

ఈసారి కేంద్ర బడ్జెట్..ఆదివారం ..ఫిబ్రవరి 1న బడ్జెట్ ప్రవేశపెట్టనున్న మోదీ సర్కార్!
  •     ఈ నెల 31 నుంచి పార్లమెంట్ సమావేశాలు

న్యూఢిల్లీ: కేంద్ర బడ్జెట్ సమావేశాలు ఈ నెల31వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. తొలి రోజు ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగించనున్నారు. ఫిబ్రవరి 1న (ఆదివారం) కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్‌‌సభలో బడ్జెట్‌‌ను ప్రవేశపెట్టనున్నారు. 

ఈ సమావేశాల్లో  దేశ వ్యా ప్తంగా ఒకేసారి ఎన్నికలు నిర్వహించే విధానం(జమిలి) వన్ నేషన్ వన్ 
ఎలక్షన్ బిల్లు, 30 రోజులు జైల్లో ఉంటే సీఎం, మంత్రులను పదవి నుంచి తొలగించే బిల్లులపై చర్చ జరగనుంది.

2014లో బీజేపీ అధికారంలోకి వ‌‌చ్చిన త‌‌ర్వాత 2017 నుంచి బ‌‌డ్జెట్ ప్రవేశపెట్టడంలో మార్పులు చేసింది. అంత‌‌కుముందు ఫిబ్రవరి చివ‌‌రి వారంలో బ‌‌డ్జెట్‌‌ను ప్రవేశపెట్టేవారు. కానీ 2017 నుంచి ఫిబ్రవరి 1వ తేదీనే బ‌‌డ్జెట్‌‌ను ప్రవేశపెడుతున్నారు. 

అయితే, ఈ ఏడాది ఫిబ్రవరి 1వ తేదీ ఆదివారం వ‌‌స్తుంది. సాధారణంగా హాలిడేస్​లో బడ్జెట్​ను ప్రవేశపెట్టే ఆనవాయితీ లేదు.  మోదీ సర్కార్ ఈ ఆనవాయితీని తొలిసారి బ్రేక్ చేయబోతున్నది. గతంలో అటల్ బిహారీ వాజపేయి ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా పనిచేసిన యశ్వంత్ సిన్హా ఆదివారం (1999లో ) బడ్జెట్ ప్రవేశ పెట్టారు. ఇప్పుడు నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టబోయేది దాదాపు 26 ఏండ్ల 
తర్వాత మరో ఆదివారం బడ్జెట్ కానుంది.

నిర్మలా సీతారామన్ సరికొత్త రికార్డ్!

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ బడ్జెట్ తో ఒక అరుదైన మైలురాయిని చేరుకోబోతున్నారు. వరుసగా 9వ సారి బడ్జెట్ ప్రవేశపెట్టిన మంత్రిగా ఆమె రికార్డు సృష్టించనున్నారు. ఇప్పటి వరకు మాజీ ప్రధాని మొరార్జీ దేశాయ్ అత్యధికంగా 10 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టగా, చిదంబరం 9 సార్లు ప్రవేశపెట్టారు. అయితే, వరుసగా 9 సార్లు ప్రవేశపెట్టిన ఘనత నిర్మలా సీతారామన్​కే దక్కనుంది.