కులాల వారీ ఓబీసీ జనగణన చేస్తే మోడీ సర్కారుకు మద్దతు

కులాల వారీ ఓబీసీ జనగణన చేస్తే మోడీ సర్కారుకు మద్దతు

లక్నో: ఉత్తరప్రదేశ్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రతిపక్ష పార్టీ బీఎస్పీ (బహుజన సమాజ్ పార్టీ) అధినేత్రి మాయావతి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కుల గణన విషయంలో సానుకూల నిర్ణయం తీసుకుంటే పార్లమెంటులో, బయట మోడీ సర్కారుకు మద్దతు ఇచ్చేందుకు సిద్ధమని ప్రకటించారు. కులాల వారీగా ఓబీసీ జన గణన చేపట్టేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్మాణాత్మక చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం కులాల వారీ జనాభా లెక్కింపు కేవలం ఎస్సీ, ఎస్టీలకు మాత్రమే నిర్వహించాలని నిర్ణయించిన నేపథ్యంలో బీజేపీ మిత్ర పక్షమైన జేడీయూ నేత, బీహార్ సీఎం నితీశ్ కుమార్ ఈ అంశంపై చర్చించేందుకు నిన్న (గురువారం) ప్రధాని నరేంద్ర మోడీని అపాయింమెంట్​ కోరారు. ఈ తరుణంలోనే మాయావతి ఇదే అంశంపై స్పందించడం ప్రాధాన్యం సంతరించుకుంది. ‘‘దేశంలో ఓబీసీ జన గణన చేట్టాల్సిందిగా బీఎస్సీ డిమాండ్ చేస్తోంది. ఈ దిశగా కేంద్ర ప్రభుత్వం ఏవైనా చర్యలు తీసుకుంటే మా పార్టీ కచ్చితంగా పార్లమెంటు లోపల, బయట కూడా మద్దతుగా నిలుస్తుంది” అని మయావతి ట్వీట్ చేశారు.