
హైదరాబాద్, వెలుగు: ప్రపంచంలోనే హైదరాబాద్ నగరం అత్యంత నివాసయోగ్యమైన ప్రాంతంగా పేరు పొందిందని, ఇతర దేశాలు హైదరాబాద్లో ఐటీ సంస్థల ఏర్పాటుకు ఇంట్రెస్ట్ చూపుతు న్నాయని మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అన్నారు. అమెరికా పర్యటనలో ఉన్న మేయర్..బుధవారం వాషింగ్టన్ డీసీలో జరిగిన యునైటెడ్ నేషన్ ఫుడ్ అండ్ అగ్రికల్చరల్ ఆర్గనైజేషన్ ఈవెంట్‌లో స్పెషల్ గెస్ట్‌గా పాల్గొని మాట్లాడారు. తెలంగాణలో హరితహారం పేరుతో గ్రీనరీకి ప్రయార్టీ ఇస్తున్నామన్నారు. పెద్ద ఎత్తున పచ్చదనం పెంపొందించడంతో పాటు హైదరాబాద్‌ను పచ్చని, పర్యావరణ అనుకూల నగరంగా మారుస్తున్నామని ఆమె తెలిపారు.