దానం నాగేందర్తో మేయర్ విజయలక్ష్మీ భేటీ

 దానం నాగేందర్తో మేయర్ విజయలక్ష్మీ భేటీ

సికింద్రాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి దానం నాగేందర్ తో భేటీ అయ్యారు సిటీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మీ. ఉదయం దానంతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. గత వారం కాంగ్రెస్ స్టేట్ ఇంచార్జ్ దీపాదాస్ మున్షీ స్వయంగా మేయర్ ఇంటికి వెళ్లి కలిశారు. పార్టీలోకి రావాలని మున్షీ ఆహ్వానించారని చెప్పారు మేయర్.

కాంగ్రెస్ లోకి రావాలనే ఆహ్వానంపై అనుచరులు, కార్యకర్తలతో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు విజయలక్ష్మీ. మరోవైపు మార్చి 26న కేకే కు బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ ఫోన్ చేసి రావాలని పిలిచినా ఆయన వెళ్లలేదని తెలుస్తోంది.  గతంలో కేకే కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యుడిగా పనిచేశారు.

బీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ, ఎంపీ కే కేశవరావు  కూమార్తెనే గద్వాల విజయలక్ష్మి2016లో జీహెచ్ఎంసీకి జరిగిన ఎన్నికల్లో గద్వాల విజయలక్ష్మి బీఆర్ఎస్ తరఫున బంజారాహిల్స్‌ కార్పొరేటర్‌గా పోటీ చేసి గెలిచారు  2021లో రెండవసారి గెలిచి, మేయర్‌గా ఎన్నికయ్యారు.

హైదరాబాద్  లోని బీఆర్ఎస్ కార్పొరేటర్లపై హస్తం నేతలు దృష్టి పెట్టారు. ఇప్పటికే కాంగ్రెస్ లోకి పదికి పైగా కార్పొరేటర్లు బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లో చేరారు.  పార్లమెంట్ ఎన్నికల ముందే బీఆర్ఎస్ నుంచి కీలక నేతలు కాంగ్రెస్ లో చేరతారని తెలుస్తోంది. లోక్ సభ ఎన్నికల్లో ఎలాగైనా సిటీలో  సత్తాచాటాలని చూస్తోంది కాంగ్రెస్.