కుశలవ్, తన్మయి జంటగా వెంకట్ బులెమోని దర్శకత్వంలో శ్రీలత వెంకట్ నిర్మిస్తున్న చిత్రం ‘మయూఖం’. శుక్రవారం పూజా కార్యక్రమాలతో ఈ చిత్రాన్ని ప్రారంభించారు. ముహూర్తపు సన్నివేశానికి టీ సిరీస్ మ్యూజిక్ నుంచి ప్రియాంక మన్యాల్ క్లాప్ కొట్టగా, సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్ కెమెరా స్విచ్చాన్ చేశారు. దర్శకుల సంఘం ప్రెసిడెంట్ వీర శంకర్ ఫస్ట్ షాట్ డైరెక్షన్ చేశారు. నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ మూవీ టీమ్ కు బెస్ట్ విషెస్ అందించారు.
ఈ సందర్భంగా నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో డైరెక్టర్ వెంకట్ మాట్లాడుతూ ‘ఇదొక మైథలాజికల్ థ్రిల్లర్. దీన్నొక ఫ్రాంఛైజీలా, ఒక యూనివర్స్‌లా క్రియేట్ చేయబోతున్నాం’ అని చెప్పారు. ఈ చిత్రంలో నటించడం పట్ల హీరో హీరోయిన్స్ సంతోషం వ్యక్తం చేశారు
