
కాశీబుగ్గ, వెలుగు: ఎంబీబీఎస్ యాజమాన్య కోటా ప్రవేశాలకు వరంగల్ కాళోజీ నారాయణ రావు హెల్త్యూనివర్సిటీ శనివారం నోటిఫికేషన్విడుదల చేసింది. ఈ నెల 24వ తేది సాయంత్రం 5 గంటల వరకు వెబ్ ఆప్షన్లను నమోదు చేసుకోవచ్చు. ఇప్పటికే యూనివర్సిటీ విడుదల చేసిన తుది మెరిట్జాబితాలోని అర్హులైన అభ్యర్థులు ఈ విడత వెబ్ కౌన్సెలింగ్కు అర్హులు. గత విడత కౌన్సెలింగ్లో సీట్అలాట్ అయి జాయిన్ కాకపోయినా, డిస్ కంటిన్యూ చేసినా ఆల్ ఇండియా కోటాలో ఇప్పటికే సీటు పొందిన అభ్యర్థులు ఈ కౌన్సెలింగ్కు అనర్హులు. కాగా, నీట్ ఎండీఎస్ కటాఫ్ స్కోర్ తగ్గిన నేపథ్యంలో కన్వీనర్, యాజమాన్య కోటాలో దరఖాస్తుకు కాళోజీ హెల్త్ యూనివర్సిటీ శనివారం వేర్వేరుగా నోటిఫికేషన్లను విడుదల చేసింది.
అభ్యర్థులు 24వ తేది ఉదయం 8గంటల నుంచి 27వ తేది సాయంత్రం 5గంటల వరకు దరఖాస్తు చేసుకోవచ్చు, ఆన్లైన్లో దరఖాస్తుతో పాటు సంబంధిత ధృవీకరణ పత్రాలను ఆప్లోడ్ చేయాలని సూచించింది. అభ్యర్థులు ఇతర వివరాలకు www.knruhs.telangana.gov.in వెబ్ సైట్లో సంప్రదించాలని యూనివర్సిటీ వర్గాలు తెలిపాయి.