టార్గెట్​.. రూ.లక్ష కోట్లు : ఆర్​.కె. ఝా

టార్గెట్​.. రూ.లక్ష కోట్లు : ఆర్​.కె. ఝా

హైదరాబాద్​, వెలుగు : ఎల్​ఐసీ మ్యూచువల్​ ఫండ్​అసెట్స్​ అండర్​ మేనేజ్​మెంట్​(ఏయూఎం) విలువ డిసెంబరు నాటికి రూ.27 వేల కోట్ల వరకు ఉందని, 2027 ఆర్థిక సంవత్సరం వరకు దీనిని రూ.లక్ష కోట్లకు తీసుకెళ్తామని సంస్థ ఎండీ ఆర్​.కె. ఝా చెప్పారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఏయూఎం రూ.16 వేల కోట్లు పెరిగిందని చెప్పారు. అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్ ఇండియా  ప్రకారం, 31 డిసెంబర్ 2023 నాటికి దేశీయ మ్యూచువల్ ఫండ్ పరిశ్రమ నిర్వహణ  కింద ఉన్న ఆస్తుల విలువ రూ. 50.77 లక్షల కోట్లకు చేరింది.

ఇందులో తెలుగు రాష్ట్రాలవాటా రూ. 1.43 లక్షల కోట్లు. ఒక్క రాజధాని నగరంలోనే దాదాపు రూ. లక్ష కోట్ల ఏయూఎం ఉంది. ‘‘తెలంగా ఈక్విటీ- ఫోకస్డ్ మార్కెట్. ఈక్విటీ -టు -నాన్- ఈక్విటీ నిష్పత్తి  70:30 గా ఉంది.  సంపన్న వ్యాపారులు ఎక్కువ కాబట్టి  ఫండ్ హౌస్‌‌‌‌లకు నగరంలో వ్యాపారాన్ని పెంచుకోవడానికి చాలా అవకాశాలు ఉన్నాయి”అని అన్నారు.