నేపాల్ వరదల్లో 288 భారతీయలు గల్లంతు:  కేంద్రం

నేపాల్ వరదల్లో 288 భారతీయలు గల్లంతు:  కేంద్రం

నేపాల్ వరదల్లో 288 మంది భారతీయులు గల్లంతైనట్లు భారత విదేశాంగ శాఖ  ప్రకటించింది. త్రిశూలీ 1 ప్రాజెక్ట్ సిబ్బంది73 మంది ,తమిళనాడుకు చెందిన 86 మంది,పశ్చిమబెంగాళ్ కు చెందిన 32 మంది, కేరళకు చెందిన 33 మంది గల్లంతైనట్లు వెల్లడించింది. 

టిబెట్‌లో చిక్కుకుపోయిన వారిలో సుమారు 200 మంది సహాయం కోసం సంప్రదించగా, భారత దౌత్య కార్యాలయం వారిని రక్షించే ఏర్పాట్లను సమన్వయం చేస్తోందని వెల్లడించింది. మరోవైపు నేపాల్‌లో రక్షించబడిన 21 మంది భారతీయులను తిరిగి భారతదేశానికి తీసుకువస్తున్నట్లు భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి, రణ్ దీర్ జైశ్వాల్ తెలిపారు.

నేపాల్ పరిస్థితులను భారత్ నిరంతరం పర్యవేక్షిస్తోందని..నేపాల్ కు భారత్ అండగా నిలుస్తోందని తెలిపారు. .నేపాల్ కు మానవతా సాయం అందించడమే తమలక్ష్యమని..ద్వైపాక్షిక సహాయంతో నేపాలకు అండగా ఉంటామని  వెల్లడించారు.  SAARC, BIMSTEC ద్వారా కూడా సాయం అందిస్తామన్నారు.

నేపాల్-టిబెట్ సరిహద్దు ప్రాంతాల్లో హిమాలయ నదుల ప్రవాహానికి అడ్డుగా హిమపాతం జరగడంతో ఒక్కసారిగా ఉప్పెనలా వరదలు ముంచెత్తాయి. ఈ పెను విపత్తులో  వందలాది మంది చనిపోగా..  వేలాది మంది నిరాశ్రయులయ్యారు.  

గల్లంతైన వారిలో కైలాస మానససరోవర యాత్రకు వెళ్లిన యాత్రికులతో పాటు తెలుగు రాష్ట్రాలు సహా దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వెళ్లిన టూరిస్టులు ఉన్నట్లు తెలుస్తోంది. సహాయక చర్యలు ముమ్మరం చేసినప్పటికీ, దెబ్బతిన్న రోడ్లు, వంతెనల కారణంగా రెస్క్యూ టీమ్‌లకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. 

ఈ ఘటనపై భారత్ తీవ్రంగా స్పందించింది. నేపాల్‌కు ఎన్డీఆర్ఎఫ్ సహాయక సామగ్రి, మందులతో కూడిన ప్రత్యేక విమానాలను పంపింది. మరోవైపు, నేపాల్‌లోని భారత రాయబార కార్యాలయం ప్రత్యేక హెల్ప్‌లైన్ నంబర్లను ఏర్పాటు చేసి, గల్లంతైన వారి ఆచూకీ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తోంది.