మెదక్ లో  సెంట్రలైజ్డ్ కమ్యూనిటీ కిచెన్ రెడీ

మెదక్ లో  సెంట్రలైజ్డ్ కమ్యూనిటీ కిచెన్ రెడీ
  • రూ.2 కోట్లతో అత్యాధునిక హంగులతో నిర్మాణం 
  •     సీఏం బ్రేక్ ఫాస్ట్ స్కీం అమలు కోసం ఏర్పాటు 
  •     ఇడ్లీ, దోశ, పూరి తయారీకి ఆధునిక యంత్రాలు సిద్ధం 
  •     మెదక్, సిద్దిపేట, కామారెడ్డి జిల్లాల్లోని స్కూల్స్ కు బ్రేక్ ఫాస్ట్ ఇక్కడి నుంచే సరఫరా 
  •     మొదట స్కూల్ స్టూడెంట్స్ కు.. ఆ తర్వాత జూనియర్ కాలేజీ స్టూడెంట్స్ కు బ్రేక్ ఫాస్ట్

మెదక్, వెలుగు: ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్​ కాలేజీల్లో చదువుతున్న విద్యార్థులు రెగ్యులర్​ గా హాజరయ్యేలా చూడటం, వారి ఆరోగ్య పరిరక్షణలో భాగంగా ఉదయం పూట పోషకాలతో కూడిన అల్పాహారం (బ్రేక్​ ఫాస్ట్​) అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు సీఎం బ్రేక్​ ఫాస్ట్​ పేరుతో ప్రారంభించిన పథకాన్ని దశల వారీగా రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో అమలు చేస్తున్నారు.

ఇందులో భాగంగా హరే కృష్ణ మూవ్​మెంట్​(హెచ్​ కే ఎం) చారిటబుల్​ ట్రస్ట్​ సహకారంతో ఈ పథకాన్ని అమలు చేస్తున్నారు. ఇందుకోసం ఇస్కాన్​ 70 శాతం, రాష్ట్ర ప్రభుత్వం 30 శాతం భరించనుంది. ఈ క్రమంలో జిల్లా కేంద్రమైన మెదక్ పట్టణంలోని వ్యవసాయ మార్కెట్​ యార్డ్​ లోని గోదాములో సెంట్రలైజ్డ్ ​ కమ్యూనిటీ కిచెన్​ ను ఏర్పాటు చేశారు. దాదాపు రూ.2 కోట్లతో అత్యాధునికంగా దీనిని రెడీ చేశారు. స్కూల్​ స్టూడెంట్స్​కు  బ్రేక్ ఫాస్ట్​ గా ఇడ్లీ, పూరి, దోశ అందిచనుండగా శుచి, శుభ్రత, రుచికరంగా వాటిని తయారు చేసేందుకు వీలుగా అత్యాధునికమైన యంత్రాలు సమకూర్చారు. ఈ కిచెన్​ లో ఆటో మెడెట్​ సిస్టంలో తక్కువ సమయంలో ఎక్కువ మొత్తంలో ఇడ్లీలు, పూరీలు, దోశలు తయారవుతాయి. వాటిని సంబంధిత స్కూల్స్​ కు చేరవేసేందుకు వీలుగా ప్రత్యేక పాత్రలు సైతం సమకూర్చారు. బ్రేక్​ ఫాస్ట్​ తో పాటు స్కూడెంట్స్​ కు పాలు కూడా అందిస్తారు. 

దశల వారీగా అమలు.. 

మెదక్ జిల్లాలోని 21 మండలాల పరిధిలో  ప్రభుత్వ ప్రైమరీ స్కూల్స్, అప్పర్​ ప్రైమరీ స్కూల్స్, జడ్పీ హైస్కూల్స్​ కలిపి మొత్తం 883 స్కూల్స్​ ఉండగా, వాటిలో మొత్తం 70 వేల పైచిలుకు విద్యార్థులు చదువుకుంటున్నారు. వారందరికీ మెదక్ లోని సెంట్రలైజ్డ్ కమ్యూనిటీ కిచెన్​ నుంచి బ్రేక్​ ఫాస్ట్​ సరఫరా చేయనున్నారు. ఈ నెల 23న సెంట్రలైజ్డ్​ కిచెన్​ ను జిల్లా ఇన్​ఛార్జి మంత్రి వివేక్​ వెంకటస్వామి అధికారికంగా ప్రారంభించనుండగా, ముందుగా మెదక్ మండల పరిధిలోని స్కూళ్లలో చదువుకుంటున్న 3,500 మంది విద్యార్థులకు బ్రేక్​ ఫాస్ట్​ అందించనున్నారు. ఆ తర్వాత దశల వారీగా జిల్లాలోని అన్ని మండలాలకు విస్తరించనున్నారు. 

సిద్దిపేట, కామారెడ్డి జిల్లాలకూ ఇక్కడి నుంచే.. 

మెదక్‌‌‌‌‌‌‌‌ పట్టణంలో ఏర్పాటు చేసిన సెంట్రలైజ్డ్ కమ్యూనిటీ కిచెన్​ ద్వారా మెదక్ జిల్లాలోని స్కూల్స్​ తో పాటు సిద్దిపేట, కామారెడ్డి జిల్లాల పరిధిలోని స్కూల్స్​కు సైతం బ్రేక్​ ఫాస్ట్ సరఫరా చేయనున్నారు. మొదటి దశలో స్కూల్​ స్టూడెంట్స్​ కు బ్రేక్​ ఫాస్ట్​ అందించనుండగా, ఆ తర్వాత రెండో దశలో ప్రభుత్వ జూనియర్​ కాలేజీ స్టూడెంట్స్​కు సైతం బ్రేక్​ ఫాస్ట్​ అందించనున్నారు.