గ్రామసభలను ప్రశాంతంగా నిర్వహించాలి

గ్రామసభలను ప్రశాంతంగా నిర్వహించాలి

మెదక్​ టౌన్​, వెలుగు: ప్రజాపాలన– ప్రగతి ప్రణాళికలో భాగంగా మెదక్‌‌‌‌ జిల్లావ్యాప్తంగా గురువారం జరిపే గ్రామ సభలను ప్రశాంతంగా నిర్వహించుకోవాలని కలెక్టర్​ప్రతిమాసింగ్​ అన్నారు. ఈ సందర్భంగా బుధవారం గూగుల్​మీట్​లో మాట్లాడుతూ గ్రామ సభల్లో ప్రజాప్రతినిధులు, గ్రామస్తులను భాగస్వాములను చేయాలన్నారు. ప్రభుత్వం ఏర్పడిన ఈ రెండున్నరేళ్లలో అనేక అభివృద్ధి పనులు చేపట్టిందని, కొత్తగా మరికొన్ని పథకాలు చేపడుతోందన్నారు. ఈ విషయాలను పంచాయతీలు, మున్సిపాలిటీల్లో అవగాహన కల్పించాలన్నారు. ప్రతి గ్రామసభకు ప్రత్యేక అధికారిని నియమిస్తున్నట్లు స్పష్టం చేశారు. 

లోపాలకు తావులేకుండా జనగణన 

టేక్మాల్​ : జనగణనలో భాగంగా మొదటి విడతలో ఇండ్లను బ్లాకులుగా విభజించి పక్కాగా గణన చేపట్టాలని మెదక్ కలెక్టర్ ప్రతిమాసింగ్ అధికారులను ఆదేశించారు. బుధవారం టేక్మాల్ మండల కేంద్రంలో ఇండ్ల గణన ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జనగణన మొదటి దశలో భాగంగా మే 11 నుంచి జూన్ 9 వరకు ఇండ్ల గణనను చేపట్టనున్నట్లు చెప్పారు. ఎలాంటి తప్పిదాలు లేకుండా పటిష్టంగా జనగణన బ్లాకుల రూపకల్పన ప్రక్రియ సమర్థవంతంగా నిర్వహించాలన్నారు .