
నర్సాపూర్, వెలుగు : గురుకులాల్లో సౌకర్యాల కల్పనకు, బాలిక విద్యను బలోపేతం చేయడానికి ప్రభుత్వం కృషి చేస్తుందని కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు.శుక్రవారం నర్సాపూర్ పట్టణంలో విస్తృతంగా పర్యటించి వివిధ సంక్షేమ పాఠశాలలు, కళాశాలలను కలెక్టర్ పరిశీలించారు. విద్యార్థులకు ఇస్తున్న మెనూ స్వయంగా పరిశీలించారు. స్టోర్ రూమ్‌ను పరిశీలించి స్టాక్ వివరాలను అడిగి తెలుసుకున్నారు.
కార్పొరేట్ దీటుగా విద్యాబోధన ఉండాలని సూచించారు. మరుగుదొడ్ల నిర్మాణం, వసతి సౌకర్యం, సమస్యలను సంబంధిత పర్యటనల ద్వారా తెలుసుకొని సౌకర్యాలు మెరుగు పర్చేందుకు కృషి చేస్తున్నట్లు కలెక్టర్ వివరించారు.