మెదక్ జిల్లాలో విషాదం.. చెరువులో మునిగి నలుగురు మృతి

మెదక్ జిల్లాలో విషాదం.. చెరువులో మునిగి నలుగురు మృతి

మెదక్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. మనోహరాబాద్ మండలం రంగయ్యపల్లి చెరువులో మునిగి నలుగురు మృతిచెందారు. మృతుల్లో ముగ్గురు మహిళలు, ఒక బాలుడు(12) ఉన్నారు. వివరాల్లోకి వెలితే..

 రంగయ్యాపల్లిలోని బంధువుల ఇంటికి ముగ్గురు మహిళలు, ఒక బాలుడు శుభకార్యానికి వచ్చారు. అయితే ఆ గ్రామంలోని చెరువులో స్నానం చేస్తామని చెప్పి ఇంటి నుంచి చెరువు దగ్గరకు చేరుకున్నారు నలుగురు. వీరిలో బాలుడు మొదట స్నానం చెయడానికి చెరువులోకి దిగాడు. అయితే అతను ఎంతసేపటికీ బయటకు రాలేదు. నీళ్లలో మునిగిపోవడంతో బాలుడిని కాపాడటానికి ఒకరి తర్వాత ఒకరు  ముగ్గురు మహిళలు చెరువులో దిగారు. మహిళలు కూడా నీటిలో మునిగిపోయారు. 

 

చెరువులో ముగ్గురు మహిళలు, బాలుడు మునిగిపోయారని  గమనించిన స్థానికులు గజ ఈతగాళ్లకు సమాచారం అందించారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న ఈతగాళ్లు..వారి కోసం గాలించారు. చివరకు ముగ్గురు మహిళల మృత దేహాలను వెలికితీశారు. బాబు మృతదేహం కోసం ఇంకా చెరువులో గాలిస్తున్నారు. శుభకార్యానికి వచ్చి నలుగురు మృతి చెందడంత రంగయ్యపల్లి గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.