- మెదక్ కలెక్టర్ ప్రతిమా సింగ్
మెదక్, వెలుగు: సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు రీల్స్ తో, ప్రింట్ మీడియా రిపోర్టర్‌లో ఆర్టికల్స్‌తో, ఎలక్ట్రానిక్ మీడియా రిపోర్టర్ లు స్టోరీలతో మెదక్ జిల్లాలోని పర్యాటక ప్రదేశాలపై విస్తృత ప్రచారం కల్పించాలని కలెక్టర్ ప్రతిమా సింగ్ కోరారు. గురువారం కలెక్టరేట్‌లో నిర్వహించిన సమావేశంలో ‘ఇన్ఫ్లుయెన్సర్ రీల్స్ కాంపిటీషన్’ పోస్టర్‌ను ఆమె ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక వారోత్సవాల్లో భాగంగా జిల్లా టూరిజంపై 4కే నాణ్యతతో కూడిన రీల్స్ పంపే వారికి నగదు బహుమతులు అందజేస్తామని తెలిపారు. ఆసక్తి గలవారు ఈనెల 30 సాయంత్రం 5 గంటల లోపు తమ వీడియోలను జిల్లా పౌర సంబంధాల శాఖ కార్యాలయంలో లేదా డీపీఆర్ఓ రామచంద్రరాజు 99499 22291, ఏపీఆర్ఓ బాబు 9701306838 నంబర్లకు వాట్సాప్ ద్వారా పంపించవచ్చని, విజేతలకు జూన్ 2న బహుమతులు అందజేస్తామని వెల్లడించారు. జిల్లాలో టూరిస్ట్ గైడ్‌ల నియామకం కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు పేర్కొన్నారు.
