తూప్రాన్, వెలుగు: తూప్రాన్ మున్సిపల్ పరిధి అల్లాపూర్ టోల్ ప్లాజా వద్ద సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ లో గురువారం జరిగిన ఉమ్మడి మెదక్ జిల్లా అండర్ 14 టచ్ రగ్బీ పోటీల్లో ప్రతిభ చూపిన క్రీడాకారులను రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక చేశామని ఉమ్మడి మెదక్ జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీలు నాగరాజు, సౌందర్య, శ్రీనివాసు తెలిపారు.
రాష్ట స్థాయి పోటీలకు బాలికల విభాగంలో ఆశ్రిత, స్ఫూర్తి, నమ్నూన్, ప్రశాంతి, మనస్విని, వైష్ణవి, నిషిత, రాజేశ్వరి, శాశ్విత, నందిని, శ్రీవల్లి, ప్రణవ్య, బాలుర విభాగంలో రిశాంక్, సాయి రిస్వత్, అభిషేక్, సాత్విక్, నవదీప్, గౌతమ్, రిషి, నమృత్ రెడ్డి, చరణ్, బద్రీనాథ్, చందు ఎన్నికయ్యారన్నారు.
వీరికి క్యాంపు ఏర్పాటు చేసి అందులో ప్రతిభ చూపిన 12 మంది బాలికలను,12 బాలురను రాష్ట్ర స్థాయి పోటీలకు పంపిస్తామన్నారు కార్యక్రమంలో ప్రిన్సిపాల్ సుహాసిని, జిల్లా రగ్బీ అసోసియేషన్ అధ్యక్షుడు గణేశ్ రవికుమార్, నవీన్, మహేశ్, నరేశ్, శ్రీనాథ్, తూప్రాన్ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పీడీ రమేశ్, నిజాంపేట్ పీడీ ప్రవీణ్, పీఈటీలు నిర్మల, సరిత, శిల్ప, చంటి పాల్గొన్నారు.
