మెదక్ టౌన్, వెలుగు: మెదక్ పట్టణంలో బుధవారం రాత్రి హనుమాన్ జయంతి సందర్భంగా శోభాయాత్ర ఘనంగా నిర్వహించారు. నర్సాపూర్–- హైదరాబాద్ వెల్కమ్బోర్డులోని అభయ ఆంజనేయస్వామి ఆలయం నుంచి శోభాయాత్ర ప్రారంభమైంది. ఈ యాత్రలో హనుమాన్, శ్రీరాముడు, భజరంగ్భళీ విగ్రహాలను ట్రాక్టర్లలో ఉంచి ర్యాలీగా బయల్దేరారు.
వెల్కమ్ బోర్డు నుంచి శోభాయాత్ర ప్రారంభం కాగా ఆటోనగర్, పాత బస్టాండ్, రాందాస్ చౌరస్తా, జేఎన్ రోడ్డు, ముత్యాలమ్మ ఆలయం, చమన్ హనుమాన్ ఆలయం, బాలాజీ మఠం, పోస్టాఫీసు, బోరంచమ్మ దేవాలయం మీదుగా కోదండ రామాలయం వరకు నిర్వహించగా యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొని నినాదాలు చేశారు. డీఎస్పీ ప్రసన్నకుమార్ నేతృత్వంలో మెదక్ టౌన్, రూరల్, సీఐలు మహేశ్, జార్జ్, ఎస్సైలు భద్రతా ఏర్పాట్లను
పర్యవేక్షించారు.
01mdk54 - మెదక్‌లో హనుమాన్ శోభాయాత్ర
01mdk55హనుమాన్ శోభాయాత్రలో యువత
