- మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు
మెదక్ టౌన్, వెలుగు: మెదక్ మున్సిపాలిటీని తీర్చిదిద్దే బాధ్యత తనదేనని స్థానిక ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు అన్నారు. ఈ మేరకు సోమవారం మెదక్ పట్టణంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. మెదక్ మున్సిపాలిటీ అభివృద్ధి వైపు దూసుకెళ్తుందని తెలిపారు. ఇటీవల పట్టణాభివృద్ధి కోసం టీయూఎఫ్ఐడీసీ ద్వారా రూ.55 కోట్లు వచ్చాయని, వాటిని సైతం త్వరలోనే ప్రారంభిస్తామని పేర్కొన్నారు. అభివృద్ధి, సంక్షేమం విషయంలో ఎలాంటి రాజీలేదని, నియోజకవర్గ అభివృద్ధే తన ఆకాంక్ష అని ఎమ్మెల్యే తెలిపారు. రెండేళ్ల తమ ప్రభుత్వ పాలనలో నియోజకవర్గానికి కోట్లాది రూపాయల నిధులు తీసుకొచ్చామన్నారు.
అదే విధంగా రాబోయే రోజుల్లో మరిన్ని నిధులు తెచ్చి మెదక్ మున్సిపాలిటీని అభివృద్ధి వైపు తీసుకెళ్లనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో మెదక్ మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, మున్సిపల్ మాజీ చైర్మన్ చంద్రపాల్, కాంగ్రెస్ పార్టీ నాయకులు మేడి మధుసూదన్ రావు, లక్ష్మీనారాయణ, మమత, శ్రీధర్ యాదవ్, ముత్యం గౌడ్, లింగం, అంజద్, గంగాధర్,శివరామకృష్ణ, వెంకట నారాయణ, హరిత నర్సింగ రావు, బట్టి సులోచన, గోదల జ్యోతి, స్వరూప, దయాసాగర్, భానీ మున్సిపల్ డీఈ మహేష్ తదితరులు పాల్గొన్నారు
