- సర్పంచ్ స్థానాలకు 3,828
మెదక్/సంగారెడ్డి/సిద్దిపేట, వెలుగు: ఉమ్మడి మెదక్ జిల్లాలో రెండో విడతలో దండిగా నామినేషన్లు దాఖలయ్యాయి. మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట జిల్లాల పరిధిలోని 28 మండలాల పరిధిలో 575 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరుగుతుండగా సర్పంచ్ స్థానాలకు మొత్తం 3,818 నామినేషన్లు దాఖలయ్యాయి. 5,098 వార్డ్ మెంబర్ స్థానాలకు మొత్తం 12,875 నామినేషన్లు దాఖలయ్యాయి.
ఏకగ్రీవ ప్రయత్నాలు
నామినేషన్ల దాఖలు గడువు ముగిసిపోగా వివిధ గ్రామ పంచాయతీ సర్పంచ్, వార్డ్ మెంబర్ స్థానాలను ఏకగ్రీవం చేసేందుకు ప్రయత్నాలు మొదలయ్యాయి. ప్రధానంగా రెండు నామినేషన్లు దాఖలైన చోట ఇరు వర్గాలతో చర్చలు జరుపుతున్నారు. కొన్ని చోట్ల ఏకాభిప్రాయం కుదరగా, మరికొన్ని చోట్ల సంప్రదింపులు కొనసాగుతున్నాయి. పలు చోట్ల ఇప్పుడు సర్పంచ్ కు ఒకరికి అవకాశం ఇస్తే నామినేషన్ ఉప సంహరించుకున్న వారికి రానున్న మండల పరిషత్ ఎన్నికల్లో ఎంపీటీసీగా అవకాశం కల్పిస్తామని హామీలు ఇస్తున్నారు.
మెదక్ జిల్లా
మండలం సర్పంచ్ నామినేషన్లు వార్డు నామినేషన్లు
చేగుంట 25 18 226 613
నార్సింగి 9 65 80 219
మనోహరాబాద్ 1 131 148 527
తూప్రాన్ 14 76 114 300
రామాయంపేట 16 126 138 325
నిజాంపేట 1 102 142 368
మెదక్ 21 134 178 396
చిన్నశంకరంపేట 31 185 264 682
సంగారెడ్డి జిల్లా
మండలం సర్పంచ్ నామినేషన్లు వార్డు నామినేషన్లు
- అందోల్ 25 163 224 548
- చౌటకూర్ 15 85 134 371
- పుల్కల్ 19 106 172 408
- వట్పల్లి 22 138 190 419
- ఝరాసంఘం 33 171 288 619
- రాయికోడ్ 32 189 270 535
- జహీరాబాద్ 22 154 210 508
- కొహీర్ 23 152 214 550
- మోగడంపల్లి 22 117 200 446
- మునిపల్లి 30 169 262 561
సిద్దిపేట జిల్లా
మండలం సర్పంచ్ నామినేషన్లు వార్డు నామినేషన్లు
- అక్బర్ పేట 19 159 168 450
- చిన్న కోడూర్ 28 19 256 700
- బెజ్జంకి 24 166 210 526
- దుబ్బాక 21 131 188 453
- మిరుదొడ్డి 10 67 98 295
- నంగనూర్ 25 188 220 560
- నారాయణపేట 11 99 96 251
- సిద్దిపేట రూరల్ 15 154 140 407
- సిద్దిపేట అర్బన్ 12 94 116 446
- తొగుట 17 112 152 392
