- మెదక్ ఎస్పీ డీవీ శ్రీనివాస్ రావు
మెదక్ టౌన్, వెలుగు : గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా ప్రజలు సహకరించాలని ఎస్పీ డీవీ శ్రీనివాస్‌రావు కోరారు. సోమవారం హవేళీ ఘనపూర్మండలం గాజిరెడ్డిపల్లి, గాజిరెడ్డిపల్లి తండా, బూర్గుపల్లి గ్రామాల ప్రజలకు ఎన్నికల నియమావళిపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ఎలాంటి గొడవలు, దాడులు, అల్లర్లు జరగకుండా ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఎన్నికల ప్రచారానికి, స్పీకర్లు, మైకులు, పోస్టర్లు, ర్యాలీలకు అన్నింటికీ అనుమతి తీసుకోవాలని సూచించారు.
ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఎక్కడైనా అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే డయల్ 100 లేదా స్థానిక పోలీసులను సమాచారం ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో మెదక్డీఎస్పీ ప్రసన్నకుమార్, మెదక్ రూరల్ సీఐ జార్జ్, ఎస్ఐ నరేశ్ తదితరులు పాల్గొన్నారు.
