జాతర తేదీలు ఇవే : మేడారం జాతరకు ఏర్పాట్లు పూర్తి

జాతర తేదీలు ఇవే : మేడారం జాతరకు ఏర్పాట్లు పూర్తి

పూర్తయిన ఏర్పాట్లు.. కోటి మందికి పైగా వస్తారని అంచనా

జయశంకర్‌‌‌‌ భూపాలపల్లి, వెలుగురాష్ట్ర పండుగ మేడారం మహా జాతర కోసం రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ఏర్పాట్లు పూర్తి కావచ్చాయి. ఈసారి ప్లాస్టిక్‌‌ ‌‌ఫ్రీ జాతరగా ప్రచారం చేస్తున్నారు. భక్తులెవ్వరూ ప్లాస్టిక్‌‌‌‌ కవర్లు.. వస్తువులు తీసుకురావద్దని ఇప్పటికే తెలియజేశారు. ఆర్టీసీ బస్టాండ్లు, గ్రామ పంచాయతీల వద్ద ప్రచార బోర్డులు కూడా ఏర్పాటు చేశారు.  గిరిజన సంస్కృతి సంప్రదాయాల ప్రకారం ఫిబ్రవరి 5 నుంచి 8వ తేదీ వరకు సమ్మక్క సారలమ్మ జాతర జరగనుంది. దేశ విదేశాల నుంచి కోటి మందికి పైగా భక్తులు వస్తారని అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో భక్తులకు సౌకర్యాలు కల్పించడానికి ప్రభుత్వం రూ.75 కోట్లు విడుదల చేసింది.

గతేడాది సెప్టెంబర్‌‌‌‌లో పనులు మొదలుపెట్టారు. దాదాపు అన్ని అభివృద్ధి పనులు పూర్తి కావస్తున్నాయి. జాతర చుట్టుపక్కల ప్రాంతాల్లో 400 సీసీ కెమెరాలను ఏర్పాటుచేశారు. గద్దెల వద్దనే 30కి పైగా కెమెరాలను ఫిక్స్‌‌‌‌చేశారు. మేడారం జాతర జరిగే ప్రధాన రహదారులు, దేవాలయాల ప్రహరీలపై ఈసారి జాతర విశిష్టతను తెలియచేసే రంగు, రంగుల బొమ్మలను వేయించారు. చిలకల గుట్టకు పోయే దారి, జంపన్నవాగు వద్ద, మేడారం గద్దెల వద్ద వేసిన బొమ్మలు అందరిని ఎంతగానో ఆకర్షిస్తున్నాయి. జాతరలో  30 వేల మందికి పైగా ఉద్యోగులు సేవలందించనున్నారు. ఒక్క పోలీస్‌‌‌‌శాఖ తరఫునే 10 వేల మందికి పైగా డ్యూటీ చేస్తారు.

4 కి.మీ. పొడవునా నల్లాలు

మేడారం వచ్చే భక్తులందరూ జంపన్నవాగులో స్నానం చేస్తారు. జాతర సమయంలో వారం రోజుల పాటు అధికారులు లక్నవరం నుంచి నీళ్లు వదులుతారు. నీళ్లల్లోకి దిగి స్నానాలు చేయలేని వారికోసం జంపన్నవాగు రెండు వైపులా సుమారు 4 కి.మీ. పొడవునా  రూ.1.69 కోట్లతో ప్రభుత్వం బ్యాటరీ ఆఫ్‌‌‌‌ ట్యాప్స్‌‌‌‌ ఏర్పాటు చేసింది. మోటార్లు పని చేయడానికి కరెంట్‌‌‌‌ కనెక్షన్​తో పాటు జనరేటర్లను సైతం ఏర్పాటు చేశారు. వాగు వద్ద స్త్రీలు బట్టలు మార్చుకోవడానికి 50కి పైగా తాత్కాలిక రూములను ఏర్పాటుచేశారు. ఇందు కోసం రూ.23 లక్షలు కేటాయించారు.

తాగునీటికి 3 వాటర్‌‌ ‌‌ట్యాంకులు

మేడారం జాతరలో ఈసారి మిషన్‌‌ ‌‌భగీరథ పథకం ద్వారా భక్తులకు రక్షిత మంచినీరు అందించాలనే ఉద్దేశంతో రూ.2 కోట్లతో మూడు వాటర్‌‌‌‌ట్యాంక్‌‌‌‌లను నిర్మించారు. ఊరట్టం దగ్గర 2 లక్షలు, జంపన్నవాగు సమీపంలో 4 లక్షలు, జంపన్నవాగు ఇవతల 2 లక్షల లీటర్ల నీటిని నిల్వచేసే వాటర్‌‌‌‌ట్యాంక్‌‌‌‌లను ఏర్పాటు చేశారు. ఇవికాక ఇంకా జాతర చుట్టుపక్కల ప్రాంతాల్లో 50కి  పైగా మినీ వాటర్‌‌‌‌ట్యాంక్‌‌‌‌లు ఉన్నాయి. భక్తులు నివాసం ఉండే ప్రతి చోట శుద్ధి చేసిన తాగునీరు అందించేలా అధికారులు చర్యలు తీసుకున్నారు.

16 చోట్ల వైద్య శిబిరాలు

జాతరకొచ్చే భక్తులకు వైద్య సౌకర్యాలు అందించడానికి ప్రభుత్వం తరపున 16 చోట్ల ఉచిత వైద్య శిబిరాలను ఏర్పాటు చేస్తున్నారు. టీటీడీ కళ్యాణ మండపంలో 50 పడకల ఆసుపత్రిని ఏర్పాటు చేస్తారు. ఇక్కడ 50 మందికి పైగా స్పెషలిస్టు డాక్టర్లు, సిబ్బంది అందుబాటులో ఉంటారు. జాతర పరిసర ప్రాంతాల్లో 4 పడకలతో కూడిన వైద్య శిబిరాలను ఏర్పాటు చేశారు. ఒక్కోచోట ముగ్గురు డాక్టర్లు ఉంటారు. డాక్టర్లు, ఏఎన్‌‌‌‌ఎంలు, పారా మెడికల్‌‌ ‌‌సిబ్బంది కలిపి రెండు వేలకు పైగా ఇక్కడ విధులు నిర్వహించనున్నారు.

32 పార్కింగ్‌‌‌‌ స్థలాలు

జాతరకొచ్చే వాహనాలను పార్కింగ్‌‌‌‌ చేయడానికి వీలుగా పోలీసులు32 పార్కింగ్‌‌‌‌స్థలాలను ఏర్పాటు చేశారు. వీఐపీ, వీవీఐపీ, ఆర్టీసీ, ప్రైవేట్‌‌‌‌వాహనాలకు వేర్వేరుగా పార్కింగ్‌‌‌‌ప్లేస్‌‌‌‌లు ఇచ్చారు. పస్రా‒మేడారం, భూపాలపల్లి‒మేడారం, తాడ్వాయి‒మేడారం, ఏటూరునాగారం‒మేడారం ఏరియాలలో ఈ  పార్కింగ్‌‌‌‌ ప్లేస్‌‌‌‌లున్నాయి. పార్కింగ్‌‌‌‌ కోసం వెయ్యి ఎకరాలకు పైగా స్థలాలను చదును చేశారు.

ఆర్టీసీ తరపున 4 వేల బస్సులు

జాతరకు ఆర్టీసీ 4 వేల బస్సులను నడిపించనుంది. రాష్ట్రవ్యాప్తంగా 51 ప్రాంతాల్లో ఆర్టీసీ శిబిరాలను ఏర్పాటు చేసింది. ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే భక్తులు గద్దెల దగ్గరి వరకు వచ్చేలా ఏర్పాట్లు చేశారు. కేవలం అర కిలోమీటర్‌‌‌‌ దూరంలో గద్దెలు ఉంటాయి.

బీటీ, అంతర్గత రోడ్లకు మరమ్మతులు

జాతర కోసం రోడ్లు భవనాల శాఖ ద్వారా రూ.8.05 కోట్లు, పంచాయతీ రాజ్‌‌‌‌శాఖ ద్వారా రూ.3.5 కోట్లు ఖర్చు చేశారు. మేడారానికి వచ్చే అన్ని రహదారులను బాగు చేయడంతో పాటు మేడారం జాతర పరిసర ప్రాంతాల్లో ఉన్న అంతర్గత రహదారులకు సైతం మరమ్మతులు చేశారు. ఇవీ కాక నేషనల్‌‌‌‌హైవే పనులు కూడా జరుగుతున్నాయి.

మహా జాతర తేదీలు

ఫిబ్రవరి 5: సారలమ్మ గద్దెకు వస్తుంది

ఫిబ్రవరి 6: సమ్మక్క గద్దెకు వస్తుంది

ఫిబ్రవరి 7: మొక్కులు సమర్పించుట

ఫిబ్రవరి 8: అమ్మవార్ల వన ప్రవేశం

see also: కమలం గ్రాఫ్​ పెరిగింది

see also: పాల సేకరణ ధర రూ.2 పెరిగింది

see also: ఈరోజే చైర్‌‌ పర్సన్లు, మేయర్ల ఎన్నిక

see also: ‘హంగ్​’లలో ఎక్కువ టీఆర్​ఎస్​ చేతికి?