మేడారం జాతర: చిల్డ్రన్ ట్రాకింగ్ అండ్ మానిటరింగ్ సిస్టమ్..చిన్నారులు, వృద్ధులు, దివ్యాంగులు తప్పిపోకుండా చర్యలు

మేడారం జాతర: చిల్డ్రన్ ట్రాకింగ్ అండ్ మానిటరింగ్ సిస్టమ్..చిన్నారులు, వృద్ధులు, దివ్యాంగులు తప్పిపోకుండా చర్యలు
  • 11 కేంద్రాల్లో అందుబాటులో 25 వేల రిస్ట్‌‌‌‌ బ్యాండ్లు

హైదరాబాద్ : మేడారం జాతరలో భక్తుల రక్షణకు పటిష్ట ఏర్పాట్లు చేశామని డీజీపీ శివధర్ రెడ్డి తెలిపారు.  గతంలో లేని విధంగా ‘చిల్డ్రన్ ట్రాకింగ్ అండ్ మానిటరింగ్ సిస్టమ్’ రిస్ట్ బ్యాండ్‌‌‌‌ టెక్నాలజీ వినియోగిస్తున్నామన్నారు. చిన్నపిల్లలు, దివ్యాంగులు తప్పిపోతే ఆచూకీని తక్షణమే కనిపెట్టి, సురక్షితంగా కుటుంసభ్యుల వద్దకు చేర్చవచ్చన్నారు. 

వొడాఫోన్, ఐడియా లిమిటెడ్ సహకారంతో రూపొందించిన క్యూఆర్ కోడ్ ఆధారిత రిస్ట్ బ్యాండ్లను, సంబంధిత పోస్టర్లను ఆయన శనివారం ఆవిష్కరించి మాట్లాడారు.  హైదరాబాద్ లక్డీకాపూల్‌‌‌‌లోని హెడ్‌‌‌‌ క్వార్టర్స్‌‌‌‌లో ఎస్‌‌‌‌ఐబీ సుమతి సహా వొడాఫోన్‌‌‌‌ సిబ్బంది పాల్లొన్నారు. 

25,000 రిస్ట్‌‌‌‌ బ్యాండ్లు, క్యూ ఆర్ కోడ్‌‌‌‌ స్కానర్లు

హన్మకొండ హయగ్రీవచారి గ్రౌండ్, హైదరాబాద్‌‌‌‌లోని ఉప్పల్ బస్ స్టేషన్, ఎంజీబీఎస్, కరీంనగర్, పరకాల, పెద్దపల్లి, మంథని, ఏటూరునాగారం, కాటారం బస్ స్టేషన్లతో పాటు వరంగల్, కాజీపేట రైల్వే స్టేషన్లలో11 కేంద్రాలను ఏర్పాటు చేశారు. 25వేల రిస్ట్ బ్యాండ్లను అందుబాటులో ఉంచారు. ఈ సదుపాయాన్ని భక్తులు వినియోగించుకోవచ్చు. 

జాతరకు వచ్చే పిల్లలు, దివ్యాంగుల వివరాలను నమోదు చేసి ప్రత్యేకమైన క్యూఆర్ కోడ్ రిస్ట్ బ్యాండ్‌‌‌‌ను కడతారు. పిల్లల పేరు, తల్లిదండ్రుల వివరాలు, ఫోన్ నంబర్లను నమోదు చేస్తాయి. ఎవరైనా తప్పిపోయి కనిపిస్తే, స్మార్ట్‌‌‌‌ఫోన్లతో క్యూఆర్ కోడ్‌‌‌‌ను స్కాన్ చేస్తే తల్లిదండ్రుల లేదా రిజిస్టర్‌‌‌‌‌‌‌‌ ఫోన్ నంబర్లు, డయల్100 వివరాలు కనిపిస్తాయి. దీంతో తక్షణమే కుటుంబ సభ్యులకు సమాచారం అందించి, సురక్షితంగా అప్పగింవచ్చు. అనంతరం కుటుంబంతో కలిసిన ఫోటోను కూడా సిస్టమ్‌‌‌‌లో అప్‌‌‌‌లోడ్ చేస్తారు.