మేడారం మహా జాతర.. V6 వెలుగు ఫోటో గ్యాలరీ

మేడారం మహా జాతర.. V6 వెలుగు ఫోటో గ్యాలరీ

మేడారం మహాజాతర అంగరంగా వైభవంగా కొనసాగుతోంది. ఫిబ్రవరి 21వ తేదీ ప్రారంభమైన మేడారం జాతర..ఫిబ్రవరి 24వ తేదీ ముగుస్తుంది. ఈ క్రమంలో వనదేవతలను దర్శించుకునేందుకు తెలంగాణతోపాటు సరిహద్దు రాష్ట్రాలైన ఛత్తీస్ ఘడ్, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, ఒడిస్సా, మహారాష్ట్రాల నుంచి తండోపతండాలుగా తరలివస్తున్నారు. ఈ వేడుకను ప్రభుత్వ లాంఛనాల ప్రకారం నిర్వహించడం ఆనవాయితీగా వస్తున్నది.

 గిరిజన పూజారులు గురువారం చిలుకలగుట్ట నుంచి సమ్మక్కను గద్దెపైకి తీసుకువచ్చారు. సమ్మక్క తల్లిని గద్దెలపైకి చేర్చే ప్రక్రియ గురువారం ఉదయమే మొదలయ్యింది. గిరిజన పూజారులు ఉదయం 5.30 గంటలకు వనం గుట్టలోని అడవిలోకి వెళ్లి కంకవనం(వెదురు కర్రలు) తెచ్చి గద్దెలపై ప్రతిష్ఠించారు.