ఎన్నికల సమయంలో తప్పుడు అఫిడవిట్లు ఇచ్చారు .. ఆ ఇద్దరు ఎమ్మెల్యే పదవిని రద్దు చేయండి

ఎన్నికల సమయంలో తప్పుడు అఫిడవిట్లు ఇచ్చారు .. ఆ ఇద్దరు ఎమ్మెల్యే పదవిని రద్దు చేయండి
  • మామాఅల్లుళ్ల ఎమ్మెల్యే పదవిని రద్దు చేయాలి
  • ఓయూ స్టూడెంట్​ లీడర్​ కోట శ్రీనివాస్ గౌడ్ 

ఓయూ, వెలుగు: మేడ్చల్​ మల్కాజిగిరి జిల్లాకు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు, మామాఅల్లుళ్లు చామకూర మల్లారెడ్డి, మర్రి రాజశేఖర్​రెడ్డి అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఎన్నికల కమిషన్​కు తప్పుడు అఫిడవిట్లు సమర్పించారని ఓయూ స్టూడెంట్​ లీడర్​, టీపీసీసీ ప్రచార కమిటీ మెంబర్​ కోట శ్రీనివాస్ గౌడ్  ఆరోపించారు. శుక్రవారం ఓయూలో ఏర్పాటు చేసిన  సమావేశంలో ఆయన మాట్లాడారు. 

ఎమ్మెల్యే మల్లారెడ్డి పోచంపల్లి, కండ్లకోయ, దూలపల్లి గ్రామాల్లో తనకున్న 21 ఎకరాల భూమిని, ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి దాదాపు రూ.100 కోట్లకు పైగా విలువైన రెండు ఎకరాల భూమిని అఫిడవిట్ లో చూపించలేదన్నారు. ఎలక్షన్ కమిషన్  వీరి ఎమ్మెల్యే పదవిని రద్దు చేయాలని డిమాండ్​ చేశారు.. ఈ విషయమై హైకోర్టును ఆశ్రయించనున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో సతీశ్, గణేశ్, మిద్దె రాము, వెంకట్ ముదిరాజ్, మధు తదితరులు పాల్గొన్నారు.