రసాబాసగా మేడ్చల్ నియోజకవర్గ విస్తృతస్థాయి సమావేశం

రసాబాసగా మేడ్చల్ నియోజకవర్గ విస్తృతస్థాయి సమావేశం

మేడ్చల్ నియోజక వర్గంలో జరిగిన టీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశం రసాబాసగా మారింది. మంత్రి మల్లారెడ్డి పార్టీ ప్లీనరీకీ సంబంధించి తమకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు నియోజకవర్గ కార్యకర్తలు.

మేడ్చల్ జిల్లా శామీర్ పేట్ మండలంలోని అలియాబాద్ చౌరస్తా లో మంత్రి మల్లారెడ్డి సమక్షంలో నియోజకవర్గం విస్తృత స్థాయి  సమావేశం జరిగింది. సమావేశంలో పాల్గొన్న పీర్జాదిగూడ టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు దర్గా దయాకర్ రెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అంతేకాదు..తమకు పార్టీ ప్లీనరీకి సంబంధించి ఎలాంటి సమాచారం ఇవ్వలేదంటూ మంత్రి మల్లారెడ్డితో వాగ్వాదానికి దిగారు. సమావేశం జరుగున్న స్టేజీ పై గొడవకు దిగి.. ఆ తర్వాత అక్కడి నుంచి వెళ్ళిపోయారు దర్గా దయాకర్ రెడ్డి.

అంతేకాదు.. టీఆర్ఎస్ కార్యకర్తలను మంత్రి మల్లారెడ్డి పట్టించుకోవడం లేదని .. మేడ్చల్ నియోజకవర్గ సమావేశంలో కార్యకర్తలు  ఆవేదన వ్యక్తం చేశారు.