వైన్ షాప్‌లో వ్యక్తి మృతి : కుటుంబ సభ్యుల ఆందోళన

వైన్ షాప్‌లో వ్యక్తి మృతి : కుటుంబ సభ్యుల ఆందోళన

మేడ్చల్ మల్కాజ్ గిరి : నాచారం పోలీస్ స్టేషన్ పరిధి మల్లాపూర్ లోని మద్యంషాప్ లో ఓ వ్యక్తి అనుమాస్పదంగా మృతిచెందాడు. మల్లాపూర్ లోని స్వర్ణ వైన్స్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. చనిపోయిన వ్యక్తి గోపాల్ గా స్థానికులు గుర్తించారు. వైన్ షాప్ ముందు మృతుడి కుటుంబసభ్యుల ఆందోళన చేస్తున్నారు. గోపాల్ మృతికి కారణాలేంటో ఇంకా తెలియాల్సి ఉంది. అతని వయసు దాదాపు 50 నుంచి 60 ఏళ్లు ఉంటాయి.