సర్కారు భూములు కబ్జా చేస్తే క్రిమినల్ కేసులు

సర్కారు భూములు కబ్జా చేస్తే  క్రిమినల్ కేసులు

ఘట్​కేసర్, వెలుగు:  జిల్లాలో ప్రభుత్వ భూములు కబ్జా చేస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని మేడ్చల్ అడిషనల్ కలెక్టర్ విజయేందర్ రెడ్డి హెచ్చరించారు. గురువారం ఘట్ కేసర్ మండలం కాచవాని సింగారంలోని సర్వే నంబర్.66లో ప్రభుత్వ భూమిని అధికారులతో కలిసి పరిశీలించారు. భూమి ఎంత ఉంది.. అందులో ఎంత కబ్జాకు గురైందనే వివరాలను తనిఖీ చేశారు. 

అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఇప్పటి వరకు ఎవరైనా ప్రభుత్వ భూములను కబ్జా చేయడం, వాటిలో గుడిసెలు, ఇతర కట్టడాలు ఉన్నట్లయితే వెంటనే తొలగించాలని, లేదంటే చట్టపరమైన చర్యలు ఉంటాయని స్పష్టంచేశారు. ప్రభుత్వ భూముల్లో సర్వే నంబర్లు, ప్రభుత్వ భూమి అని తెలిసేలా వెంటనే బోర్డులు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. దీంతో పాటు ఫెన్సింగ్ సైతం చేయాల్సిందిగా సూచించారు. రెవెన్యూ అధికారులు, సిబ్బంది తదితరులు ఉన్నారు.