285 రాపిడ్ రెస్పాన్స్ టీమ్స్ ఏర్పాటు : డీఎంహెచ్​వో గాయత్రీదేవి

285 రాపిడ్ రెస్పాన్స్ టీమ్స్ ఏర్పాటు : డీఎంహెచ్​వో గాయత్రీదేవి

కంది, వెలుగు :  భారీ వర్షాలు కురుస్తున్న సందర్భంగా సంగారెడ్డి జిల్లాలో 285 రాపిడ్ రెస్పాన్స్ టీమ్స్ ఏర్పాటు చేసినట్టు డీఎంహెచ్​వో గాయత్రీదేవి తెలిపారు. గురువారం వైద్య ఆరోగ్య శాఖ ఆఫీసర్లతో ఆమె అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి జిల్లాలోని పరిస్థితులపై సమీక్షించారు. వైద్య ఆరోగ్య సిబ్బంది అలర్ట్ గా ఉండాలని సూచించారు. జిల్లాలో రాపిడ్ రెస్పాన్స్ టీమ్స్ ఏర్పాటుతోపాటు సబ్ సెంటర్ లెవెల్, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, డివిజన్ లెవెల్ టీమ్స్ ను ఏర్పాటు చేశామని తెలిపారు. డిస్ట్రిక్ లెవెల్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని, ఇది 24 గంటలు పని చేస్తుందని చెప్పారు. అత్యవసర సమయంలో అన్ని మందులు కూడా అందుబాటులో ఉండేలా ఏర్పాట్లు చేశామని తెలిపారు. ఎక్కడైనా ఏమైనా కేసులు వచ్చినప్పుడు వెంటనే హెల్త్ క్యాంపులు ఏర్పాటు చేసి తగిన చర్యలు తీసుకోవాలని సిబ్బందికి సూచించారు. 

సంగారెడ్డి మున్సిపాలిటీలో....

వర్షాకాలం సందర్భంగా లోతట్టు ప్రాంతాలు ముంపుకు గురవుతాయని, పట్టణంలోని కొన్ని ప్రాంతాల్లో నాలాలు పొంగి వర్షపు నీరు ఇండ్లలోకి వచ్చే ప్రమాదం ఉన్నందున పట్టణ ప్రజలకు రక్షణ కల్పించడానికి  డిజాస్టర్ రెస్క్యూ టీమ్ ను ఏర్పాటు చేసినట్టుగా కమిషనర్​ సుజాత గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ టీమ్ మున్సిపల్​ ఆఫీసులో  ఏర్పాటు చేసిన హెల్ప్ లైన్ నంబర్​ 08-455--278377 లో 24 గంటలు అందుబాటులో ఉంటుందని 
పేర్కొన్నారు.

మెదక్​ కలెక్టరేట్​లో కంట్రోల్​ రూమ్​ఏర్పాటు

మెదక్​టౌన్, వెలుగు : మెదక్​ జిల్లాలో ఏకధాటిగా కురుస్తున్న వర్షాల కారణంగా ప్రజల అత్యవసర సేవలకు కలెక్టరేట్​లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ రాజర్షి షా గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఏ సమస్య  వచ్చినా 9391942254 నంబర్​కు ఫోన్​ చేసి ఫిర్యాదు చేయవచ్చని పేర్కొన్నారు.   వర్షాలు తగ్గేంత వరకు ప్రజలు అనవసరంగా బయటికి రావొద్దని సూచించారు. 

హెల్ప్ లైన్​ ఏర్పాటు చేయండి

పుల్కల్, వెలుగు :  పుల్కల్ మండలంలోని సింగూర్ ప్రాజెక్ట్ లోకి వస్తున్న వరదనీటిని గురువారం డిప్యూటీ కలెక్టర్ చంద్రశేఖర్  పరిశీలించారు. వర్షాలకు ప్రజలు ఇబ్బందులు పడకుండా ఆఫీసర్లు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఇరిగేషన్ ఆఫీస్, రెవెన్యూ ఆఫీస్​లలో 24 గంటలు హెల్ప్ లైన్ ఏర్పాటు చేసి ప్రజలకు అందుబాటులో ఉండాలని ఆదేశించారు. ఆయన వెంట ఈఈ మధుసూదన్ రెడ్డి, డిప్యూటీ ఈఈ నాగరాజు, ఏఈ మహిపాల్ రెడ్డి, డిప్యూటీ తహసీల్దారు కిరణ్ ఉన్నారు.