
హైదరాబాద్, వెలుగు: ఎన్నికల నేపథ్యంలో వచ్చే నెల 10న జరగాల్సిన ఏఎన్‌ఎం పోస్టుల రాతపరీక్షను వాయిదా వేస్తున్నట్లు మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డు ప్రకటించింది. ఎగ్జామ్ ఎప్పుడు నిర్వహిస్తారనే దానిపై నిర్ణయం తీసుకోలేదని, కొత్త ఎగ్జామ్ తేదీని త్వరలో ప్రకటిస్తామని శనివారం ఒక ప్రకటనలో పేర్కొంది.