హీరో సాయి ధరమ్‌ తేజ్‌కు కాలర్‌‌ బోన్ సర్జరీ

V6 Velugu Posted on Sep 12, 2021

హైదరాబాద్: హీరో సాయి ధరమ్ తేజ్ తాజా హెల్త్ బులెటిన్‌ను ఆదివారం మధ్యాహ్నం అపోలో ఆస్పత్రి విడుదల చేసింది. కాలర్ బోన్ ఫ్యాక్చర్‌‌కు తమ డాక్టర్ల టీమ్ విజయవంతంగా సర్జరీ చేసిందని ఆపోలో వెల్లడించింది. ప్రస్తుతం తేజ్ ఆరోగ్యం పరిస్థితి నిలకడగా ఉందని బులెటెన్‌లో పేర్కొంది. తమ వైద్యుల అబ్జర్వేషన్ కొనసాగుతుందని చెప్పింది. 

శుక్రవారం రాత్రి మాదాపూర్  కేబుల్ బ్రిడ్జ్ సమీపంలో  స్పోర్ట్స్ బైక్‌పై వెళ్తూ అదుపు తప్పి జారి పడిన విషయం తెలిసిందే. బైక్‌పై వస్తున్న సాయిధరమ్ తేజ్ తన ముందున్న ఆటోను ఓవర్ టేక్ చేయబోయి రోడ్డుపై ఇసుక ఉండడంతో స్కిడ్ అయి పడ్డాడు. ప్రమాదం జరిగిన  సమయంలో సాయిధరమ్ తేజ్ ఛాతీ, పొట్ట, కంటి భాగంలో స్వల్పంగా గాయాలు కావడంతో వెంటనే సాయిధరమ్ తేజ్  స్పృహ కోల్పోయాడు.వెంటనే గుర్తించి  ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంతో సాయి ధరమ్‌ తేజ్‌కు కాలర్‌‌ బోన్ విరిగింది. దీనికి సంబంధించిన సర్జరీని ఇవాళ చేశారు. డాక్టర్ అలోక్ రంజన్ నేతృత్వంలో తేజ్‌కు ట్రీట్‌మెంట్ జరుగుతున్న విషయం తెలిసిందే.

Tagged Hyderabad, Apollo Hospital, Health Bulletin, hero Sai Dharam Tej, collarbone surgery

Latest Videos

Subscribe Now

More News