మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా మే 22న మెడికల్ షాప్ లు బంద్

మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా మే 22న మెడికల్ షాప్ లు బంద్

నస్పూర్, వెలుగు: దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న మెడికల్ షాప్ ల బంద్ కు మద్దతుగా తెలంగాణ కెమిస్ట్, డ్రగ్గిస్ట్ పిలుపు మేరకు మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా ఈనెల 22న మెడికల్ షాపులు బంద్ చేయనున్నట్లు అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు మోటూరి చంద్రశేఖర్ రావు, కార్యదర్శి సుధాకర్, కోశాధికారి రాజేంద్రప్రసాద్ తెలిపారు. ఆదివారం నస్పూర్ ప్రెస్ క్లబ్ లో బంద్ కు సంబంధించిన పోస్టర్లను ఆవిష్కరించారు.