కరోనాకు మెడికల్ స్టాఫ్ 8 మంది బలి

కరోనాకు మెడికల్ స్టాఫ్ 8 మంది బలి

హైదరాబాద్, వెలుగు: సర్కార్ దవాఖాన్లలో కరోనాపై ఫ్రంట్ లైన్ వారియర్స్ గా పనిచేస్తూ.. ఆ వైరస్ బారినపడి చనిపోయిన మెడికల్ స్టాఫ్, సిబ్బంది సంఖ్య 8కి చేరింది. శుక్రవారం 35 ఏళ్ల యంగ్ డాక్టర్ నరేశ్ కూడా చనిపోవడంతో సర్కా రీ డాక్టర్లు ఆందోళన చెందుతున్నారు. తొలుత గాంధీ ఆస్పత్రిలో సెక్యూరి టీ గార్ డుగా పని చేసిన ఓ వ్యక్తి కరోనా సోకడంతో చనిపోయాడు. ఆ తర్వాత చెస్ట్‌‌‌‌‌‌‌‌ ఆస్పత్రిలో సీనియర్‌‌‌‌‌‌‌‌ స్టాఫ్‌‌‌‌‌‌‌‌ నర్స్‌ జయమణి, ఇదే ఆస్పత్రిలో ల్యాబ్‌ టెక్నిషియన్‌‌‌‌‌‌‌గా పనిజేన్తున్న దామెర గోవర్ధన్ ​వైరస్ బారిన పడి మరణించారు. పేట్ల బురుజు హాస్పిటల్ లో అటెండర్, ఫీవర్‌‌‌‌‌‌‌‌ హాస్పిటల్ లో ధోబీతో పాటు ఎమ్‌ఎన్‌‌‌‌‌‌‌‌ఓ, వరంగల్‌‌‌‌‌‌‌‌ ఎంజీఎం ఆస్పత్రిలో ల్యాబ్‌ టెక్ని షీయన్‌‌‌‌‌‌‌‌ ఎండీ ఖుర్షీద్‌ కరోనా వల్ల చనిపోయారు.