నారాయణ మెడికల్ కాలేజీలో మెడికో ఆత్మహత్య

నారాయణ మెడికల్ కాలేజీలో  మెడికో ఆత్మహత్య

నెల్లూరు జిల్లాలో వైద్య విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది.నెల్లూరు నగరంలోని చింతారెడ్డిపాలెం దగ్గర ఉన్న  నారాయణ మెడికల్ కాలేజీలో హౌస్ సర్జన్ గా పనిచేస్తున్న  చైతన్య  ఆత్మహత్యకు పాల్పడింది. తోటి విద్యార్థులు సమాచారం ఇవ్వడంతో హాస్టల్ కు వచ్చిన పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు.

 మృతురాలిని శ్రీకాకుళం జిల్లా పలాసకు చెందిన  యువతిగా గుర్తించారు పోలీసులు. చైతన్యకు రెండు నెలల కింద వివాహం అయినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఆమె మృతికి కుటుంబ కలహాలే కారణమని పోలీసులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతికి గల కారణాలపై విచారణ చేస్తున్నారు.