నిజామాబాద్ లో మెడికల్ స్టూడెంట్ ఆత్మహత్య

నిజామాబాద్ లో మెడికల్ స్టూడెంట్ ఆత్మహత్య

తెలంగాణ రాష్ట్రం నిజామాబాద్ జిల్లాలోని మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ స్టూడెంట్ సనత్ ఆత్మహత్య చేసుకున్నాడు. హాస్టల్ లోని తన గదిలో ఫ్యాన్ కు ఉరి వేసుకున్నాడు. 2023, మార్చి 31వ తేదీ తెల్లవారుజామున ఈ విషయం వెలుగులోకి వచ్చింది. సనత్ ఎంబీబీఎస్ మూడో సంవత్సరం చదువుతున్నాడు. మృతుడు సనత్ ది పెద్దపల్లి జిల్లా గోదావరి ఖని.

మెడికల్ స్టూడెంట్ ఆత్మహత్యపై పోలీసులకు సమాచారం ఇచ్చారు కాలేజీ నిర్వహకులు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సనత్ ఆత్మహత్యకు కారణాలు ఏంటీ.. ఎందుకు ఇలా చేశాడు అనే విషయాలపై అతని ఫ్రెండ్స్, సహచర స్టూడెంట్స్ ద్వారా వివరాలు రాబడుతున్నారు. కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. వారి నుంచి కూడా వివరాలు సేకరిస్తున్నారు.