కులం పేరుతో తిట్టాడని మెడికల్ కాలేజ్లో విద్యార్థుల ఆందోళన

కులం పేరుతో తిట్టాడని మెడికల్ కాలేజ్లో విద్యార్థుల ఆందోళన

జగిత్యాల మెడికల్ కాలేజ్ ఆవరణలో అర్ధరాత్రి వైస్ ప్రిన్సిపల్ డేవిడ్ ఆనంద్, కాలేజ్ స్టూడెంట్స్ ఆందోళనకు దిగారు. అర్ధరాత్రి కాలేజ్ క్యాంపస్ లోకి వచ్చిన ఓ ప్రభుత్వ డాక్టర్.. కులం పేరుతో తిట్టాడని వారు ఆరోపిస్తున్నారు. అడ్మినిస్ట్రేషన్  బ్లాక్ కు గది ఎందుకివ్వడం లేదంటూ డాక్టర్ కులం పేరుతో ఇష్టం వచ్చినట్లు తిట్టాడని వైస్ ప్రిన్సిపాల్ చెప్పారు. సమాచారం అందుకున్న పోలీసులు క్యాంపస్ కు చేరుకొని వైస్ ప్రిన్సిపల్, స్టూడెంట్స్ తో మాట్లాడారు. ఫిర్యాదు చేస్తే చర్యలు చేసుకుంటామని అన్నారు. దీంతో వారంతా కాలినడకన  పోలీస్ స్టేషన్ కు వెళ్లి డాక్టర్ పై ఫిర్యాదు చేశారు. తమకు న్యాయం చేయాలంటూ అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో పోలీస్ స్టేషన్ ముందు బైఠాయించారు. పోలీసులు నచ్చచెప్పడంతో ఆందోళన విరమించి వెనుదిరిగారు.