పోర్టబుల్‌‌‌‌‌‌‌‌ స్కానర్లు, ఎంటీపీ కిట్లతో.. యథేచ్ఛగా అబార్షన్లు

పోర్టబుల్‌‌‌‌‌‌‌‌ స్కానర్లు, ఎంటీపీ కిట్లతో.. యథేచ్ఛగా అబార్షన్లు
  •     ఆన్‌‌‌‌‌‌‌‌లైన్‌‌‌‌‌‌‌‌లో విచ్చలవిడిగా దొరుకుతున్న మెడికల్‌‌‌‌‌‌‌‌ టెర్మినేషన్‌‌‌‌‌‌‌‌ కిట్లు
  •     డాక్టర్ల పర్మిషన్‌‌‌‌‌‌‌‌ లేకుండానే అబార్షన్‌‌‌‌‌‌‌‌ చేస్తున్న ఆర్‌‌‌‌‌‌‌‌ఎంపీలు, నర్సులు
  •     సూర్యాపేట జిల్లాలోని ఓ హాస్పిటల్‌‌‌‌‌‌‌‌లో ఒకే నెలలో 98, ఖమ్మంలో 50 గర్భస్రావాలు
  •     ఆడపిల్లలను కడుపులోనే చిదిమేస్తున్నారు ! 

ఖమ్మం, వెలుగు : డాక్టర్లు, గైనకాలజీ స్పెషలిస్టుల రిఫరెన్స్‌‌‌‌‌‌‌‌తో మాత్రమే మెడికల్‌‌‌‌‌‌‌‌ షాపుల్లో అమ్మాల్సిన మెడికల్‌‌‌‌‌‌‌‌ టెర్మినేషన్‌‌‌‌‌‌‌‌ ప్యాక్‌‌‌‌‌‌‌‌లు (ఎంటీపీ) ఆన్‌‌‌‌‌‌‌‌లైన్‌‌‌‌‌‌‌‌లో విచ్చలవిడిగా దొరుకుతున్నాయి. ఈ అవకాశాన్ని కొందరు ఆర్‌‌‌‌‌‌‌‌ఎంపీలు, నర్సులు తమకు అనుకూలంగా మలుచుకుంటున్నారు. ఆన్‌‌‌‌‌‌‌‌లైన్‌‌‌‌‌‌‌‌లో ఆర్డర్‌‌‌‌‌‌‌‌ పెట్టి పెద్ద మొత్తంలో కిట్లు తెప్పించుకొని, వాహనాల్లో అప్పటికప్పుడే యథేచ్ఛగా అబార్షన్లు చేస్తున్నారు.

ఎవరి పర్మిషన్‌‌‌‌‌‌‌‌ లేకుండానే...

రూల్స్‌‌‌‌‌‌‌‌ ప్రకారం 20 వారాల్లోపు గర్భాన్ని తొలగించాలంటే తప్పనిసరిగా డాక్టర్‌‌‌‌‌‌‌‌ పర్మిషన్‌‌‌‌‌‌‌‌ తీసుకోవాలి. 24 వారాల గర్భం అయితే ఇద్దరు డాక్టర్ల ఒపీనియన్‌‌‌‌‌‌‌‌ తర్వాతే తర్వాతే తొలగించాలి. అంతకు మించిన గర్భాన్ని తొలగించాలంటే మెడికల్‌‌‌‌‌‌‌‌ బోర్డు పర్మిషన్‌‌‌‌‌‌‌‌ తీసుకోవాల్సి ఉంటుంది. కానీ ఆన్‌‌‌‌‌‌‌‌లైన్‌‌‌‌‌‌‌‌లో విచ్చలవిడిగా దొరుకుతున్న కిట్లను ఉపయోగించి ఎవరి రిఫరెన్స్‌‌‌‌‌‌‌‌ లేకుండానే, ఏ డాక్టర్‌‌‌‌‌‌‌‌ పర్మిషన్‌‌‌‌‌‌‌‌ తీసుకోకుండానే ఆర్‌‌‌‌‌‌‌‌ఎంపీలు, సీనియర్‌‌‌‌‌‌‌‌ నర్సులు యథేచ్ఛగా అబార్షన్లు చేస్తున్నారు. ఖమ్మం పట్టణంలోని పలు హాస్పిటల్స్‌‌‌‌‌‌‌‌లో ఇటీవల వైద్యశాఖ ఆఫీసర్లు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. పాకబండ బజార్‌‌‌‌‌‌‌‌లోని సుగుణ హాస్పిటల్‌‌‌‌‌‌‌‌లో మెడికల్‌‌‌‌‌‌‌‌ టెర్మినేషన్‌‌‌‌‌‌‌‌ కిట్లను ఉపయోగించి అబార్షన్లు చేస్తున్నట్లు గుర్తించి హాస్పిటల్‌‌‌‌‌‌‌‌ను సీజ్‌‌‌‌‌‌‌‌ చేశారు. ఖమ్మం, సూర్యాపేట, వరంగల్, కరీంనగర్‌‌‌‌‌‌‌‌ జిల్లాలో ఈ దందా పెద్ద ఎత్తున సాగుతున్నట్లు తెలుస్తోంది. 

మినీ వ్యాన్లలోనే స్కానింగ్‌‌‌‌‌‌‌‌, అబార్షన్‌‌‌‌‌‌‌‌

కొందరు ఆర్‌‌‌‌‌‌‌‌ఎంపీలు, నర్సులు మినీ వ్యాన్‌‌‌‌‌‌‌‌, ఇన్నోవా వంటి వాహనాల్లోనే స్కానింగ్‌‌‌‌‌‌‌‌, అబార్షన్‌‌‌‌‌‌‌‌ చేసేస్తున్నారు. సూట్‌‌‌‌‌‌‌‌కేస్‌‌‌‌‌‌‌‌ సైజ్‌‌‌‌‌‌‌‌లో ఉండే పోర్టబుల్‌‌‌‌‌‌‌‌ స్కానర్లను కొనుగోలు చేసి, వాటి ద్వారా అంబులెన్స్‌‌‌‌‌‌‌‌, మినీ వ్యాన్‌‌‌‌‌‌‌‌, ఇన్నోవాల్లోనే గర్భిణికి స్కానింగ్‌‌‌‌‌‌‌‌ చేస్తున్నారు. అమ్మాయి అని తేలితే వాహనాన్ని ఇతర ప్రాంతాల్లోకి, గ్రామ శివారుల్లోకి తీసుకెళ్లి ఎంటీపీ కిట్లను ఉపయోగించి వాహనాల్లోనే అబార్షన్‌‌‌‌‌‌‌‌ చేస్తున్నారు. మినీ స్కానర్‌‌‌‌‌‌‌‌తో స్కానింగ్‌‌‌‌‌‌‌‌, అబార్షన్‌‌‌‌‌‌‌‌ చేస్తున్న ఖమ్మానికి చెందిన 10 మంది ఆర్‌‌‌‌‌‌‌‌ఎంపీలను గతేడాది సూర్యాపేటలో పోలీసులు అరెస్ట్ చేశారు. వీరితో పాటు మరికొందరు ఆర్‌‌‌‌‌‌‌‌ఎంపీలు కూడా ఇలాంటి వ్యవహారాల్లో భాగస్వాములయ్యారని తెలుస్తోంది. ఖమ్మం పట్టణంలోని నాలుగు హాస్పిటల్స్‌‌‌‌‌‌‌‌లో ఇలాంటి అబార్షన్లు జరుగుతున్నట్లు సమాచారం. 

ఒకే రోజు ఏడు, నెలలో 50 అబార్షన్లు

ఖమ్మం పట్టణంలోని సుగుణ హాస్పిటల్‌‌‌‌‌‌‌‌లో ఇటీవల ఇద్దరు గర్భిణులకు అబార్షన్లు చేస్తుండగా హెల్త్‌‌‌‌‌‌‌‌ ఆఫీసర్లు, పోలీసులు రెడ్‌‌‌‌‌‌‌‌ హ్యాండెడ్‌‌‌‌‌‌‌‌గా పట్టుకున్నారు. ఆఫీసర్లు వచ్చే సరికే గర్భిణులకు అబార్షన్‌‌‌‌‌‌‌‌కు సంబంధించిన ఇంజక్షన్‌‌‌‌‌‌‌‌ ఇచ్చేశారు. అదే రోజు మరో అబార్షన్లు చేసినట్లు ఆఫీసర్లు నిర్ధారించారు. దీంతో హాస్పిటల్‌‌‌‌‌‌‌‌లోని ఓపీ, ఐపీ రిజిస్టర్లు, సీసీ ఫుటేజీ, సపోర్టింగ్‌‌‌‌‌‌‌‌ డాక్యుమెంట్లను సీజ్‌‌‌‌‌‌‌‌ చేశారు. మొత్తం రికార్డులను పరిశీలించిన ఆఫీసర్లు హాస్పిటల్‌‌‌‌‌‌‌‌లో నెల రోజుల్లోనే 50 మందికి అబార్షన్లు చేసినట్లు గుర్తించారు. ఇందులో ఎక్కువ సంఖ్యలో రెండు నెలల్లోపు గర్భాలనే తొలగించినట్లు తేల్చారు. మెడికల్ టెర్మినేషన్‌‌‌‌‌‌‌‌ ఆఫ్‌‌‌‌‌‌‌‌ ప్రెగ్నెన్సీ పర్మిషన్‌‌‌‌‌‌‌‌ లేకుండానే వైద్యం చేయడంతో పాటు, కేస్‌‌‌‌‌‌‌‌ షీట్లలో తప్పుడు వివరాలు నమోదు చేయడం, కోడ్‌‌‌‌‌‌‌‌ లాంగ్వేజ్‌‌‌‌‌‌‌‌ను ఉపయోగిస్తున్నట్లు గుర్తించారు. వారం రోజుల ఎంక్వైరీ తర్వాత హాస్పిటల్‌‌‌‌‌‌‌‌ రిజిస్ట్రేషన్‌‌‌‌‌‌‌‌ను రద్దు చేస్తున్నట్టు ప్రకటించడంతో పాటు, వైద్యశాఖ ఆఫీసర్లు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో హాస్పిటల్‌‌‌‌‌‌‌‌ నిర్వాహకులపై కేసు నమోదు అయింది. అయితే హాస్పిటల్‌‌‌‌‌‌‌‌కు చెందిన డాక్టర్‌‌‌‌‌‌‌‌, అబార్షన్లు చేసిన వారిపై క్రిమినల్‌‌‌‌‌‌‌‌ చర్యలు తీసుకోకపోవడంపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.

రిజిస్ట్రేషన్​ రద్దు చేస్తే, వారంలో మరో రిజిస్ట్రేషన్​..!

ప్రైవేట్ హాస్పిటల్స్‌‌‌‌‌‌‌‌లో అబార్షన్లు చేస్తూ రెడ్‌‌‌‌‌‌‌‌ హ్యాండెడ్‌‌‌‌‌‌‌‌గా దొరికినా, రిజిస్ట్రేషన్లు రద్దు అయినా మేనేజ్‌‌‌‌‌‌‌‌మెంట్లలో మార్పు రావడం లేదు. హాస్పిటల్‌‌‌‌‌‌‌‌ రిజిస్ట్రేషన్‌‌‌‌‌‌‌‌ రద్దు అయిన కొన్ని రోజులకే మరో పేరుతో పర్మిషన్‌‌‌‌‌‌‌‌ తెచ్చుకొని అదే బిల్డింగ్‌‌‌‌‌‌‌‌లో మళ్లీ హాస్పిటల్‌‌‌‌‌‌‌‌ నడిపిస్తున్నారు. సూర్యాపేటలో సంజీవని, శ్రీనిధి హాస్పిటల్స్‌‌‌‌‌‌‌‌లో అబార్షన్లు చేస్తున్నట్లు గుర్తించిన ఆఫీసర్లు ఇటీవల వాటి రిజిస్ట్రేషన్లు రద్దు చేశారు. తర్వాత కొన్ని రోజులకే అవే బిల్డింగ్స్‌‌‌‌‌‌‌‌లో కొత్త పేర్లతో మళ్లీ హాస్పిటల్స్‌‌‌‌‌‌‌‌ ఓపెన్‌‌‌‌‌‌‌‌ అయ్యాయి. ఈ సారి డాక్టర్‌‌‌‌‌‌‌‌ను మార్చి మళ్లీ అబార్షన్ల దందా కొనసాగిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. సూర్యాపేటలోని మధుబాబు అనే హాస్పిటల్‌‌‌‌‌‌‌‌లో ఒకే నెలలో 98 అబార్షన్లు చేసినట్లు ఆఫీసర్ల ఎంక్వైరీలో తేలింది. దీంతో హాస్పిటల్‌‌‌‌‌‌‌‌కు చెందిన ల్యాబ్‌‌‌‌‌‌‌‌, మెడికల్‌‌‌‌‌‌‌‌ టెర్మినేషన్‌‌‌‌‌‌‌‌ ఆఫ్‌‌‌‌‌‌‌‌ ప్రెగ్నెన్సీ లైసెన్స్‌‌‌‌‌‌‌‌ను రద్దు చేశారు. ఇద్దరు డాక్టర్లపై ఎఫ్‌‌‌‌‌‌‌‌ఐఆర్‌‌‌‌‌‌‌‌ నమోదు చేసిన పోలీసులు ఇప్పటికీ వారిని అరెస్ట్‌‌‌‌‌‌‌‌ చేయలేదు. ఆ ఇద్దరు డాక్టర్లు సూర్యాపేటలోనే వైద్యం చేస్తున్నప్పటికీ పరారీలో ఉన్నారని పోలీసులు చెప్పడం గమనార్హం.

చర్యలు తీసుకుంటాం 

రూల్స్‌‌‌‌‌‌‌‌కు విరుద్ధంగా స్కానింగ్, అబార్షన్లు చేసే హాస్పిటల్స్‌‌‌‌‌‌‌‌లో తనిఖీలు చేస్తున్నాం. ఇటీవల సుగుణ హాస్పిటల్‌‌‌‌‌‌‌‌ను సీజ్‌‌‌‌‌‌‌‌ చేసి, రిజిస్ట్రేషన్‌‌‌‌‌‌‌‌ను సైతం రద్దు చేశాం. ఆ హాస్పిటల్‌‌‌‌‌‌‌‌ డాక్టర్లకు షోకాజ్ నోటీసులు ఇచ్చాం. వారి నుంచి వివరణ వచ్చిన తర్వాత చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం.
-మాలతి, డీఎంహెచ్‌‌‌‌‌‌‌‌వో, ఖమ్మం