నోటి పూతకు మందు

నోటి పూతకు మందు

నోటిపూత వస్తే ఏదైనా తినాలన్నా, తాగాలన్నా తెగ ఇబ్బందిగా ఉంటుంది. శరీరంలో న్యూట్రియంట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, విటమిన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తక్కువైనప్పుడు నోటిపూత వస్తుంది. ఇది తగ్గడానికి రకరకాల మెడిసిన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఉన్నా.. ఇంట్లో ఉండే కొన్ని పదార్థాలతో కూడా నోటిపూత తగ్గించుకోవచ్చు.

  • కొబ్బరి నూనెలోని యాంటీ మైక్రోబియల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రాపర్టీలు యాంటీ ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫ్లమేటరీ, ఎలర్జీ ట్రీట్మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా పనిచేసి అల్సర్లను తగ్గిస్తాయి. నోటిపూత ఉన్నవాళ్లు గంటకు ఒకసారి లేదా పడుకునేముందు కొబ్బరినూనె నోట్లో రాస్తే నోటిపూత తగ్గుతుంది.     
  • బేకింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సోడా నోటిపూత వల్ల వచ్చే యాసిడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను న్యూట్రల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసి అల్సర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను తగ్గిస్తుంది. టేబుల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్పూన్ బేకింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సోడాలో కొన్ని నీళ్లు కలిపి పేస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేయాలి. ఆ పేస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను నోటిపూత మీద రాసి, ఆరనీయాలి. ఇలా రోజుకు రెండుసార్లు చేస్తే నోటిపూత తగ్గుతుంది.
  • ఒక గ్లాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గోరువెచ్చని నీళ్లలో టేబుల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్పూన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఉప్పు వేసి కలపాలి. ఆ నీళ్లను బాగా పుక్కిలించాలి. ఉప్పులో ఉన్న యాంటీ సెప్టిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లక్షణాలు నోటి పూత వల్ల వచ్చే నొప్పిని కొంత తగ్గిస్తాయి.
  • ఆరెంజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో విటమిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ – సి ఉంటుంది. ఇది ఇమ్యూనిటీని పెంచడమే కాకుండా ఇన్ఫెక్షన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రాకుండా కాపాడుతుంది. రోజూ ఆరెంజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జ్యూస్ తాగడం వల్ల అల్సర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తగ్గి, నోటి పూత పోతుంది.
  •  క్యాబేజీలో యాంటీ ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫ్లమేటరీ లక్షణాలు ఉంటాయి. ఇవి నోటి పూత తగ్గడానికి సాయపడతాయి. క్యాబేజీని ఉడకబెట్టి, ఆ నీళ్లను రోజూ తాగితే నోటి పూత తగ్గుతుంది.
  • నోటి పూత పూర్తిగా తగ్గడానికి వారం రోజులు పడుతుంది. కాబట్టి, నోటి పూత ఉన్నన్ని రోజులు మసాలా ఉండే ఫుడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, నూనె ఎక్కువగా ఉండే వంటకాలు, టీ, కాఫీలకు దూరంగా  ఉండాలి. వీటివల్ల నోటి పూత పెరిగే అవకాశం ఉంది.