
మాదాపూర్, వెలుగు: వరల్డ్ హార్ట్డే సందర్భంగా ఆదివారం హైటెక్ సిటీ మెడికవర్ హాస్పిటల్స్ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. మాదాపూర్ డివిజన్ ట్రాఫిక్ ఏసీపీ చంద్రశేఖర్ రెడ్డి, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డా. శరత్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై ర్యాలీని ప్రారంభించారు.
వయస్సుతో సంబంధం లేకుండా గుండె జబ్బులు వేగంగా పెరుగుతున్నాయని, క్రమం తప్పకుండా వ్యాయామం, సమతుల్య ఆహారం, ఆరోగ్య పరీక్షలతో గుండెను ఆరోగ్యకరంగా ఉంచుకోవాలని డా. శరత్ రెడ్డి సూచించారు. ప్రజల్లో గుండె వ్యాధులపై అవగాహన కల్పించేందుకే ఈ ర్యాలీ చేపట్టామన్నారు. వరల్డ్హార్ట్డే సందర్భంగా రూ.999కే ప్రత్యేక హెల్త్ చెకప్ ప్యాకేజీ అందిస్తున్నామని తెలిపారు.