
ఆదివారం ( ఆగస్టు 24 ) హైదరాబాద్ మేడిపల్లి స్వాతి హత్య కేసు కలకలం రేపిన సంగతి తెలిసిందే. స్వాతిని గొంతు నులిమి చంపిన భర్త మహేందర్ రెడ్డి.. యాక్సా బ్లేడుతో స్వాతి శరీరాన్ని ముక్కలు ముక్కలుగా నరికి.. శరీర భాగాలను మూసీ నదిలో పడెయ్యడంతో పోలీసులు సైతం షాకయ్యారు. ఈ క్రమంలో మహేందర్ రెడ్డి గురించి సంచలన విషయాలు బయట పెట్టింది స్వాతి చెల్లెలు శ్వేత. మహేందర్ రెడ్డి పెద్ద సైకో అని.. స్వాతితో తరచూ గొడవపడేవాడని తెలిపింది. మహేందర్ రెడ్డితో గొడవపడి స్వాతి హాస్టల్ కి వెళ్లే ఉండేదని.. కొన్ని రోజుల తర్వాత మహేందర్ స్వాతిని ఇంటికి తీసుకెళ్లినట్లు తెలిపింది.
స్వాతి హత్యకు కొద్దిరోజుల ముందు మహేందర్ తాను ఉండే హాస్టల్ దగ్గరికి వచ్చి కలిశాడని.. ఈ విషయం స్వాతికి చెప్పొద్దని అన్నాడని తెలిపింది శ్వేత. తాము గొడవ పడుతున్న విషయం గురించి అమ్మ నాన్నలకు చెప్పొద్దని స్వాతి తనతో చెప్పినట్లు తెలిపింది శ్వేత. మహేందర్ చాలాసార్లు స్వాతి కొట్టి హింసించేవాడని.. ఈ విషయాలు ఇంట్లో చెప్పకుండా ఒక్కటే భరించిందని తెలిపింది. మహేందర్ కి ఉరి శిక్ష వేయాలని.. లేకుంటే తమ కుటుంబం అంతా ఆత్మహత్య చేసుకుంటామని అంటోంది స్వాతి చెల్లెలు.
Also read:-12 తులాల బంగారం, ఒక ప్లాటు, 15 లక్షల రూపాయల కట్నం ఇస్తే..
మహేందర్ నుంచి తన తండ్రికి ప్రాణహాని ఉందని.. తన తండ్రిపై కక్ష పెట్టుకున్న మహేందర్ చంపడానికి కూడా వెనుకాడడు అని అంటోంది శ్వేత. ఇదిలా ఉండగా.. స్వాతి హత్య కేసుతో కామారెడ్డిగూడ రగిలిపోతోంది. మహేందర్ రెడ్డి తీరుపై ఆగ్రహంతో మండిపడుతున్నారు గ్రామస్థులు. మహేందర్ రెడ్డి కుటుంబసభ్యులు ఇప్పటికే ఊరు వదిలి వెళ్లిపోయినట్లు సమాచారం.గ్రామంలోకి మహేందర్ కుటుంబ సభ్యులను రానివ్వమంటున్నారు గ్రామస్తులు. కామారెడ్డిగూడ ప్రస్తుతం పోలీసుల పహారాలో ఉంది.
స్వాతి మొండెం ఉండగా.. తల, చేతులు పూర్తి భాగాలతోనే స్వాతి మృతదేహం అప్పగించాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. లేని పక్షంలో మృతదేహం తీసుకు వెళ్లేది లేదని అంటున్నారు స్వాతి కుటుంబ సభ్యులు.