12 తులాల బంగారం, ఒక ప్లాటు, 15 లక్షల రూపాయల కట్నం ఇస్తే.. పెండ్లయిన నాలుగు నెలలకే చంపేశాడు !

12 తులాల బంగారం, ఒక ప్లాటు, 15 లక్షల రూపాయల కట్నం ఇస్తే.. పెండ్లయిన నాలుగు నెలలకే చంపేశాడు !

వరంగల్: అతను ఒక ఆటో డ్రైవర్. బుద్ధిమంతుడని నమ్మి అమ్మాయిని ఇచ్చి ఆమె తల్లిదండ్రులు పెండ్లి చేశారు. భారీగా కట్నకానుకలు సమర్పించుకున్నారు. రూ.15 లక్షల డబ్బులు, 12 తులాల బంగారం, ఒక ప్లాటు కట్నంగా ఇచ్చి ఘనంగా పెళ్లి జరిపించారు. పెళ్లయిన కొత్తలో అంతా బానే ఉంది. భార్యాభర్తలు మంచిగనే ఉన్నారు. కానీ.. పెళ్లయిన రెండు నెలల తర్వాత ఆమెకు అదనపు కట్నం కోసం టార్చర్ మొదలైంది. తిట్టడం, కొట్టడం, హింసించడం.. ఇలా నవ వధువుకు ఆమె భర్త నరకం చూపించాడు. పెళ్లయి 4 నెలలు కూడా దాటలేదు. ఇంతలోనే ఆ వివాహిత తన భర్త చేతిలోనే దారుణ హత్యకు గురైంది. వరంగల్ నగరంలో ఈ దారుణం జరిగింది.

Also read:-మహేందర్ రెడ్డి గురించి పచ్చి నిజాలు బయటపెట్టిన స్వాతి చెల్లెలు..

వివాహమై 4 నెలలు దాటకముందే భార్యను భర్త హత్య చేసిన ఘటనతో వరంగల్ నగరం ఉలిక్కిపడింది. హంటర్ రోడ్డులో గౌతమి(21) అనే వివాహితను ఆమె భర్త గణేష్( 22) హత్య చేశాడు. మొహంపై దిండుపెట్టి నొక్కి హతమార్చాడు. గౌతమి స్వస్థలం వీరారం గ్రామం బాల్యం తండ మహబూబాద్ జిల్లా. గణేష్ ఆటో డ్రైవర్గా జీవనం సాగిస్తున్నాడు. అదనపు కట్నం కోసం హత్య చేశాడని గౌతమి తల్లిదండ్రులు ఆరోపించారు.  గౌతమి తండ్రి అశోక్ తన అల్లుడు గణేష్పై మట్టెవాడ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఎంజీఎం మార్చరీకి పోలీసులు తరలించారు.