- కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను గెలిపించండి
- డీసీసీ అధ్యక్షుడు, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం
కరీంనగర్ సిటీ, వెలుగు: బీఆర్ఎస్, బీజేపీ పదేండ్లు అవినీతికి పాల్పడ్డాయని, కరీంనగర్ కార్పొరేషన్‌ను అభివృద్ధి చేయలేదని డీసీసీ అధ్యక్షుడు, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ఆరోపించారు. ఈసారి కార్పొరేషన్ఎన్నికల్లో కాంగ్రెస్‌ను గెలిపిస్తే.. తాము అభివృద్ధి చేస్తామన్నారు. శనివారం కరీంనగర్‌లోని ఆర్అండ్ బీ గెస్ట్‌హౌస్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు 70 శాతం మందికి పైగా గెలిచారని తెలిపారు. ప్రజాప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనులను చూసి ప్రజలు ఓటేశారని పేర్కొన్నారు. రాబోయే మున్సిపల్, కార్పొరేషన్ఎన్నికల్లో మెజార్టీ స్థానాలను కాంగ్రెస్ కైవసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు.
బీఆర్ఎస్, బీజేపీ అవినీతి కవలుగా.. నగర ప్రజల కష్టార్జితాన్ని దోచుకున్నారని మండిపడ్డారు. స్మార్ట్ సిటీ, కేబుల్ బ్రిడ్జి పనులను నాణ్యతతో చేపట్టకుండా జేబులు నింపుకున్నారని అన్నారు. స్మార్ట్ సిటీ సేఫ్ సిటీగా ఉండాలంటే కాంగ్రెస్ కు ఒకసారి అవకాశం ఇవ్వాలని కోరారు. పార్టీ కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ చార్జి వెలిచాల రాజేందర్ రావు, నగర అధ్యక్షుడు వైద్యుల అంజన్ కుమార్, నాయకులు ఇప్ప శ్రీనివాస్ రెడ్డి, మేనేని రాజనర్సింగరావు, ముద్దం తిరుపతి, ముద్దసాని రంగన్న, కొర్వి అరుణ్ కుమార్, రామిడి రాజిరెడ్డి, సురేందర్ రెడ్డి, లింగంపల్లి బాబు, కుంబాల రాజ్ కుమార్, సిరికొండ శివప్రసాద్, నెల్లి నరేశ్, కంకణాల అనిల్ కుమార్, ఇరుమళ్ల మల్లేశం తదితరులు పాల్గొన్నారు.
