భారీ డిస్కౌంట్లతో మెడ్‌‌‌‌ప్లస్‌‌.. సొంతంగా తయారీ వల్లే సాధ్యమన్న కంపెనీ

భారీ డిస్కౌంట్లతో మెడ్‌‌‌‌ప్లస్‌‌.. సొంతంగా తయారీ వల్లే సాధ్యమన్న కంపెనీ

డెహ్రాడూన్ నుంచి వెలుగు ప్రతినిధి: తక్కువ ధరలకు మందులను అందుబాటులోకి తేవడానికి రిటైల్ ఫార్మసీ చైన్ మెడ్‌‌ప్లస్ 'స్టోర్ జెనరిక్' అనే విధానాన్ని పరిచయం చేసింది. సొంతంగా తయారు చేసిన మందులను 50–80 శాతం వరకు డిస్కౌంట్‌‌తో అమ్ముతున్నట్టు ప్రకటించింది. ఈ మోడల్ కింద, 4,200 ఫార్మసీ స్టోర్లలో దాని సొంత బ్రాండ్‌‌కు చెందిన 600 లకుపైగా ఆఫ్ -పేటెంట్ మందులను అమ్ముతోంది. 'స్టోర్ జెనరిక్' అనేది అమెరికా వంటి దేశాల్లో విజయవంతంగా నడుస్తోంది.  ఈ విషయమై కంపెనీ సీఈఓ గంగాడి మధుకర్ రెడ్డి మాట్లాడుతూ ‘‘ అకుమ్స్ ఇండియా,  విండ్లాస్ బయోటెక్ వంటి ప్రఖ్యాత కాంట్రాక్ట్ డ్రగ్ మాన్యుఫ్యాక్చరింగ్ ఆర్గనైజేషన్స్ (సీడీఎంఓ)తో కలసి పనిచేస్తున్నాం. 

వారి ప్లాంట్లలోనే మందులను తయారు చేయిస్తున్నాం. మనదేశంలోని అన్ని టాప్  కంపెనీలు మందులకు ధీటుగా మా కంపెనీ మందులూ ఉంటాయి.  ఈయూ, డబ్ల్యూహెచ్ఓ ప్రమాణాలకు అనుగుణంగా ఇవి తయారవుతాయి. మార్కెటింగ్, డిస్ట్రిబ్యూషన్ ఛానల్ ఖర్చులు లేకపోవడం వల్ల మేం మెడిసిన్స్‌‌పై 80 శాతం వరకు డిస్కౌంట్లు ఇస్తున్నాం” అని ఆయన వివరించారు.  తెలంగాణలో విజయవంతమైన తర్వాత, మెడ్‌‌ప్లస్ ఇటీవలి నెలల్లో ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్  ఒడిశాలో ‘స్టోర్ జెనరిక్స్’ని ప్రవేశపెట్టింది.