మెద్వెదెవ్‌‌‌‌కు ప్రిక్వార్టర్స్‌‌‌‌లో చుక్కెదురు

మెద్వెదెవ్‌‌‌‌కు ప్రిక్వార్టర్స్‌‌‌‌లో చుక్కెదురు
  • ప్రిక్వార్టర్స్‌‌‌‌‌‌‌‌‌‌లో షాకిచ్చిన కిరియోస్‌‌‌‌
  • క్వార్టర్స్‌‌‌‌కు రూడ్‌‌‌‌, జబేర్‌‌‌‌, గాఫ్‌‌‌‌

న్యూయార్క్‌‌‌‌:  యూఎస్‌‌‌‌ ఓపెన్ మెన్స్ సింగిల్స్‌‌‌‌లో డిఫెండింగ్‌‌‌‌ చాంప్‌‌‌‌, వరల్డ్‌‌‌‌ నంబర్‌‌‌‌ వన్‌‌‌‌ డానిల్‌‌‌‌ మెద్వెదెవ్‌‌‌‌కు ప్రిక్వార్టర్స్‌‌‌‌లోనే చుక్కెదురైంది. ఆదివారం అర్ధరాత్రి జరిగిన మ్యాచ్‌‌‌‌లో ఆస్ట్రేలియా ప్లేయర్‌‌‌‌ 23వ సీడ్‌‌‌‌ నిక్‌‌‌‌ కిరియోస్‌‌‌‌ 7-–6(11), 3-–6 ,6-–3, 6–-2తో  టాప్‌‌‌‌ సీడ్‌‌‌‌ మెద్వెదెవ్‌‌‌‌కు షాకిచ్చి మెగా టోర్నీలో తొలిసారి క్వార్టర్స్‌‌‌‌ చేరుకున్నాడు. దాంతో,  ఈ టోర్నీ ముగిశాక కొత్త వరల్డ్‌‌‌‌ నంబర్‌‌‌‌ వన్‌‌‌‌ ప్లేయర్‌‌‌‌ రానున్నాడు. డానిల్‌‌‌‌, నిక్‌‌‌‌ ఇద్దరూ పవర్‌‌‌‌ఫుల్‌‌‌‌ ఏస్‌‌‌‌లతో అదరగొట్టారు. మెద్వెదెవ్‌‌‌‌ 20 ఏస్‌‌‌‌లు కొట్టగా, కిరియోస్‌‌‌‌ 22 కొట్టాడు. డానిల్‌‌‌‌ రెండు డబుల్‌‌‌‌ ఫాల్ట్స్‌‌‌‌,  19 అనవసర తప్పిదాలు చేశాడు. నిక్‌‌‌‌ ఏడు డబుల్‌‌‌‌ ఫాల్ట్స్‌‌‌‌, 38 తప్పిదాలు చేసినప్పటికీ.. ఏడు బ్రేక్‌‌‌‌ పాయింట్లు కైవసం చేసుకున్నాడు. మూడు బ్రేక్‌‌‌‌ పాయింట్లే సాధించిన మెద్వెదెవ్‌‌‌‌ నాలుగు సెట్లలోనే పోరాటం ముగించాడు.

మరో మ్యాచ్‌‌‌‌లో ఐదో సీడ్‌‌‌‌ రూడ్‌‌‌‌ (నార్వే) 6–1, 6–2, 6–7 (4/7), 6–2తో మౌటెట్‌‌‌‌ (ఫ్రాన్స్‌‌‌‌)ను ఓడించగా,  13వ సీడ్‌‌‌‌ బెరెటిని (ఇటలీ)3–6, 7–6 (7/2), 6–3, 4–6, 6–2తో ఫొనికా( స్పెయిన్‌‌‌‌)పై నెగ్గాడు. 27వ సీడ్‌‌‌‌ కారెన్‌‌‌‌ కచనోవ్‌‌‌‌ (రష్యా).. 12వ సీడ్‌‌‌‌ పాబ్లో బుస్టా (స్పెయిన్​)ను ఓడించి క్వార్టర్స్‌‌‌‌ చేరాడు. విమెన్స్‌‌‌‌ సింగిల్స్‌‌‌‌లో ఐదో సీడ్‌‌‌‌ జబేర్(ట్యునీషియా), కొకొ గాఫ్‌‌‌‌ (అమెరికా) క్వార్టర్స్‌‌‌‌ చేరారు. జబేర్‌‌‌‌  7–6 (7/1), 6–4తో కుదెర్మెటోవా (రష్యా)ను ఓడించగా, 12వ సీడ్‌‌‌‌ గాఫ్‌‌‌‌ 7–5, 7–5తో షువై జాంగ్‌‌‌‌ (చైనా)కు చెక్‌‌‌‌ పెట్టింది. మూడో రౌండ్‌‌‌‌లో సెరెనాను ఓడించిన ఆసీస్‌‌‌‌ ప్లేయర్‌‌‌‌ తొమ్లాయనోవిచ్‌‌‌‌7–6 (10/8), 6–1తో సమ్సోనోవా (రష్యా)పై నెగ్గి క్వార్టర్స్‌‌‌‌ చేరగా.. 17వ సీడ్‌‌‌‌ గార్సియా (చెక్‌‌‌‌) 6–4, 6–1తో అలిసన్‌‌‌‌ రిస్క్‌‌‌‌ (అమెరికా)ను ఓడించింది.