ఆరేళ్ల చిన్నారిని కాపాడిన రోమియో, జూలీ

ఆరేళ్ల చిన్నారిని కాపాడిన రోమియో, జూలీ

టర్కీలో సంభవించిన భారీ భూకంపంలో శిథిలాల కింద చిక్కుకున్న చిన్నారిని రక్షించడంలో రోమియో, జూలీ కీలక పాత్ర పోషించాయి. అయితే రోమియో, జూలీ అంటే వ్యక్తులు కాదు.. స్నిఫ్ఫర్ డాగ్స్. ఈ డాగ్ స్వ్కాడ్ లో భాగమైన ఈ రెండు కుక్కలే లేకపోతే ఆరేళ్ల చిన్నారి ప్రాణాలు దక్కేవి కావు. శిథిలాల కింద చిక్కుకుపోయిన వారిని వెలికి తీసే ప్రయత్నంలో భాగంగా ఎన్టీఆర్ దళాలు డాగ్స్ ను కూడా ఉపయోగిస్తున్నాయి

సెర్చింగ్ ఆపరేషన్ లో భాగంగా బెరెన్ అనే ఆరేళ్ల చిన్నారిని రోమియో, జూలీ గుర్తించాయి. శిథిలాల కింద ఎవరైనా బతికుంటే మొరిగేలా జూలీ ట్రైనింగ్ ఇచ్చామన్న ఆయన.. అదే తరహాలో చిన్నారిని గుర్తించిందని స్పష్టం చేశారు.  ఈ విషయంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా వాటిని అభినందిస్తూ ట్వీట్ చేశారు. ఈ డాగ్ స్వ్కాడ్స్ ఎన్డీఆర్ఎఫ్ కే గర్వకారణమన్నారు. వాటి వల్లే ఈ రోజు ఆరేళ్ల చిన్నారి ప్రాణాలతో బయటపడిందని కొనియాడారు.