
ఓకల్ ఫర్ లోకల్ నినాదంతో ముందుకెళ్తామన్నారు మంత్రి కేటీఆర్. శాంతి భద్రతలపై కఠినంగా ఉంటామన్నారు. అభివృద్ధి కావాలా?విద్వేషం కావాలా? తేల్చుకోవాలన్నారు ఆయన… మీట్ ది ప్రెస్ లో మాట్లాడిన కేటీఆర్.. రాష్ట్రం ఏర్పడినప్పుడు ఎంతో అనిశ్చితి ఉందన్నారు మంత్రి కేటీఆర్. తెలంగాణ ఏర్పడితే రాష్ట్రం చీకటిమయంగా మారుతుందన్నారు. రాష్ట్రం ఏర్పడితే పెట్టుబడులు పోతాయని,కొత్తవి రావన్నారు. రాష్ట్రం ఏర్పాటయ్యాక మౌలిక సదుపాయాలపై దృష్టిపెట్టామన్నారు. గతంలో 14 రోజులకోసారి నీళ్లు వచ్చేవని.. హైదరాబాద్ తో పాటు శివారు ప్రాంతాలకు నీళ్లిచ్చామన్నారు. హైదరాబాద్ లో తాగునీటి కోసం యుద్ధాలు చేసే పరిస్థితి లేదన్నారు. స్వచ్ఛ సర్వేక్షణ్ లో హైదరాబాద్ ముందుందన్నారు. రోజూ 2 వేల టన్నుల నిర్మాణ రంగ వ్యర్థాలు తొలగిస్తున్నామన్నారు.
హైదరాబాద్ లో కర్ఫ్యూలు, అల్లర్లు ,పోకిరిల బెడదలేదన్నారు. హైదరాబాద్ ను సేఫెస్ట్ సిటీగా మార్చుతున్నామన్నారు. దేశంలోని సీసీ కెమెరాల్లో 65 శాతం హైదరాబాద్ లోనే ఉన్నాయన్నారు. లింక్ రోడ్లతో హైదరాబాద్ రహదారులపై రద్దీ తగ్గిస్తున్నామన్నారు. హైదరాబాద్ లో అన్ని వైపుల అభివృద్ధి చేస్తున్నామన్నారు. ఐటీతో పాటు లైఫ్ సైన్సెస్ పై దృష్టి పెట్టామన్నారు. లక్ష డబుల్ బెడ్రూం ఇళ్లు రెడీ అవుతున్నాయన్నారు. రోజుకు 50 వేల మందికి రూ.5కే నాణ్యమైన భోజనం అందిస్తున్నామన్నారు. హైదరాబాద్ ను ఉపాధి కేంద్రంగా మార్చామన్నారు. 8 వేట పబ్లిక్ టాయిలెట్లు కట్టామన్నారు. ఆరేళ్లలో ఛార్జీలు, పన్నులు పెంచలేదన్నారు. కాలుష్య పరిశ్రమలను హైదరాబాద్ బయటకు పంపిస్తామన్నారు. నాలాలు,చెరువుల మీద ఆక్రమణలు తొలగిస్తామన్నారు. శాంతిభద్రతల విషయంలో వెనక్కి తగ్గబోమన్నారు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీస్తే ఊరుకోమన్నారు