
ప్రపంచం ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన అమెరికా-రష్యా అధ్యక్షుల భేటీ ముగిసింది. సుమారు మూడు గంటల పాటు సాగిన అలస్కా మీటింగ్ లో కీలక అంశాలపై చర్చించారు. యూఎస్ ప్రసిడెంట్ ట్రంప్ తదుపరి భేటీ.. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీతో ఉంటుందని ప్రకటించారు. సోమవారం (ఆగస్టు 18) ఈ భేటీ ఉంటుందని అనౌన్స్ చేశారు.
రష్యా అధ్యక్షుడు పుతిన్ తో జరిపిన చర్చలో కీలకంగా రష్యా -ఉక్రెయిన్ యుద్ధంపైనే చర్చించారు. మీటింగ్ మరో గంటలో ముగుస్తుందనగా జెలెన్ స్కీకి కాల్ చేసి నెక్స్ట్ మీటింగ్ గురించి ఇన్ఫామ్ చేశారు ట్రంప్. అదే విధంగా ఇరు దేశాల మధ్య శాంతి ఒప్పందం కోసం సీజ్ ఫైర్ చేసుకునేందుకు పుతిన్ అంగీకరించినట్లు ఫోన్ ద్వారా చెప్పారు. ట్రంప్ ప్రపోజల్ కు జెలెన్ స్కీ అంగీకరించారు.
సోమవారం యూఎస్ కు వెళ్తున్నట్లు ఫోన్ కాల్ అనంతరం జెలెన్ స్కీ ప్రకటించారు. ఈ ఏడాది ఫిబ్రవరి ఓవల్ లో జరిగిన ఫేస్ టూ ఫేస్ మీటింగ్ తర్వాత ట్రంప్ తో కలవడం ఇది రెండో సారి అవుతుంది. అయితే అలస్కా మీటింగ్ లో చర్చలు జరపడం వరకే కానీ.. సీజ్ ఫైర్ పై ఎలాంటి ఒప్పందం చేసుకోలేదు. దీని తర్వాత జెలెన్ స్కీ తో పాటు యూరోపియన్ లీడర్లకు ఫోన్ చేసి మాట్లాడారు ట్రంప్.
ALSO READ : భారత్‌పై సుంకాలు విధించినంత మాత్రాన పుతిన్ ఆగడు
యూఎస్, రష్యా, ఉక్రెయిన్ దేశాల మధ్య మీటింగ్ ను జెలెన్స్ స్కీ అంగీకరించారు. శాంతి కోసం సిద్ధంగా ఉన్నట్లు పదేపదే చెబుతున్నామని అన్నారు. ఈ సిచువేషన్ ను డీల్ చేసేందుకు అమెరికా పెద్దరికం పనిచేస్తే అంతకు మించిన సంతోషం ఏముంటుందని అన్నారు. శాంతి ఒప్పందం జరిగేందుకు ఇరుదేశాల మధ్య ఉన్న కీలక అంశాలపై ముగ్గురు నేతల మధ్య చర్చ జరగాలని.. అందుకోసం ట్రైలేటరల్ మీటింగ్ సరిపోతుందని అన్నారు.