చైనాలో మెగా ఎయిర్ పోర్టు

చైనాలో మెగా ఎయిర్ పోర్టు

ఎయిర్‌ పోర్ట్‌ కు లింకయ్యే రైలు,
రోడ్లతో కలిపి నిర్మాణంఖర్చు
దాదాపు 17.5 బిలియన్‌ డాలర్లు
173 ఎకరాల్లో దీన్ని నిర్మిం చారు.
స్టార్‌ ఫిష్‌ ఆకారంలో ఉంది,
8 రన్‌ వేలు ఉంటాయి
ఇరాక్‌ – బ్రిటిష్‌ ఆర్కిటెక్ట్‌
జాహా హదీద్‌ దీన్ని డిజైన్‌ చేశారు
ఈ ఎయిర్‌ పోర్ట్‌ నుంచి ఏటా
10 కోట్ల మంది ప్రయాణించవచ్చు
4 మిలియన్‌ టన్ను ల కార్గో ను
రవాణా చేయొచ్చు
40 వేల మంది వర్కర్లు దీన్ని
నిర్మాణంలో పాల్గొన్నారు
2014లో ఎయిర్‌ పోర్ట్‌ నిర్మాణం ప్రారంభమైంది

బీజింగ్ : చైనాలో న్యూ మెగా ఎయిర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పోర్ట్‌‌‌‌‌‌‌‌గా పేరు పొందిన డాక్సింగ్‌‌‌‌‌‌‌‌ ఎయిర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పోర్ట్‌‌‌‌‌‌‌‌ ఓపెన్‌‌‌‌‌‌‌‌ అయింది. చైనా ప్రెసిడెంట్‌‌‌‌‌‌‌‌ జిన్‌‌‌‌‌‌‌‌పింగ్‌‌‌‌‌‌‌‌ బుధవారం అధికారికంగా దీన్ని ప్రారంభించారు. పీపుల్స్‌‌‌‌‌‌‌‌ రిపబ్లిక్‌‌‌‌‌‌‌‌ 70వ వార్షికోత్సవ సంబురాల్లో భాగంగా దీన్ని తెరిచినట్లు జిన్‌‌‌‌‌‌‌‌పింగ్‌‌‌‌‌‌‌‌ ప్రకటించారు. స్టార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫిష్‌‌‌‌‌‌‌‌ షేప్‌‌‌‌‌‌‌‌లో ఎయిర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పోర్ట్‌‌‌‌‌‌‌‌ను నిర్మించారు. ఏటా దాదాపు 10 కోట్ల మంది ఈ ఎయిర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పోర్ట్‌‌‌‌‌‌‌‌ నుంచి ప్రయాణం చేస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. ఎనిమిది రన్‌‌‌‌‌‌‌‌వేలు ఉన్న డాక్సింగ్‌‌‌‌‌‌‌‌ 2040 నాటికి పూర్తిస్థాయిలో అందుబాటులోకి రానుంది. ఇప్పటికే కొన్ని ఫారిన్‌‌‌‌‌‌‌‌, డొమస్టిక్‌‌‌‌‌‌‌‌ క్యారియర్లు ఈ ఎయిర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పోర్ట్‌‌‌‌‌‌‌‌ నుంచి సేవలు మొదలుపెట్టాయి.

డాక్సింగ్‌‌‌‌‌‌‌‌ పూర్తి స్థాయిలో అందుబాటులకి వస్తే ప్రపంచంలోనే అతిపెద్ద, అత్యంత బిజీ ఎయిర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పోర్ట్‌‌‌‌‌‌‌‌గా రికార్డులకు ఎక్కే అవకాశం ఉంది. ప్రస్తుతం  యూఎస్‌‌‌‌‌‌‌‌లోని అట్లాంటా ఎయిర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పోర్ట్‌‌‌‌‌‌‌‌ ప్రపంచంలోనే బిజీ ఎయిర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పోర్ట్‌‌‌‌‌‌‌‌గా గుర్తింపు పొందగా.. దాని తర్వాత బీజింగ్‌‌‌‌‌‌‌‌ ఎయిర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పోర్ట్‌‌‌‌‌‌‌‌ రెండో స్థానంలో ఉంది. తియానన్మెన్‌‌‌‌‌‌‌‌ స్వ్కేర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు 46 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ డాక్సింగ్‌‌‌‌‌‌‌‌ ఎయిర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పోర్ట్‌‌‌‌‌‌‌‌ టర్మినల్‌‌‌‌‌‌‌‌ కింద రైల్వే స్టేషన్‌‌‌‌‌‌‌‌, మెట్రో ట్రైన్‌‌‌‌‌‌‌‌ను నిర్మిస్తున్నారు. ఎయిర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పోర్ట్‌‌‌‌‌‌‌‌ నుంచి 20 నిమిషాల్లో సిటీ సెంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు చేరుకునేలా వీటిని కడుతున్నారు. ఈ ఎయిర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పోర్ట్‌‌‌‌‌‌‌‌ ప్రారంభోత్సవంతో రెండు ఇంటర్నేషనల్‌‌‌‌‌‌‌‌ ఎయిర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పోర్ట్‌‌‌‌‌‌‌‌లు ఉన్న సిటీల లిస్ట్‌‌‌‌‌‌‌‌లో బీజింగ్‌‌‌‌‌‌‌‌  చేరింది.