అభిమానుల వల్లే ఈ స్థాయిలో ఉన్నా

అభిమానుల వల్లే ఈ స్థాయిలో ఉన్నా

తాను ఈ స్థాయిలో ఉన్నానంటే దానికి కారణం అభిమానులేనని మెగాస్టార్ చిరంజీవి వెల్లడించారు. చరిత్రపురి కాలనీలో ఉండే సినీ కార్మికులకోసం ఓ ఆసుపత్రిని కడుతున్నట్లు.. వచ్చే పుట్టిన రోజుకల్లా దాన్ని ప్రారంభిస్తామన్నారు. కొణిదెల వెంకట్ రావు పేరు పెట్టాలని అనుకుంటున్నట్లు, ఆసుపత్రి నిర్మాణ విషయంలో ఎంతో మంది ముందుకు రావడం అభినందనీయమన్నారు. పార్క్ హయత్ హోటల్ లో సెలెబ్రిటీ క్రికెట్ కప్ కర్టెన్ రైజర్ కార్యక్రమం జరిగింది. ముఖ్యఅతిథిగా చిరంజీవి విచ్చేశారు. TCA కి చెందిన ట్రోఫీ, జెర్సీలని చిరంజీవి ఆవిష్కరించారు. ఇటీవల నేషనల్ అవార్డ్ సాధించిన థమన్ ని సన్మానించారు. అనంతరం చిరంజీవి మాట్లాడుతూ..ఎంతో మంది తమ్ముళ్ల ప్రేమని పొందుతున్న తాను చాలా అదృష్టవంతుడనని, క్రికెట్ ఆడుతూ పదిమందికి సేవ చేస్తున్న వారికి అభినందనలు తెలియచేస్తున్నట్లు తెలిపారు. మనం ఎంత ఎత్తుకు ఎదిగినా... ఆపదలో ఉన్నవాళ్ళకి సహాయం అందించే గుణం ఉండాలని సూచించారు. తృప్తి లేనిపారికి మానసిక శాంతికూడా ఉండదని.. ఇది తాను స్వయంగా అనుభవించి చెబుతున్నట్లు తెలిపారు. తాను కష్టపడి పని చేస్తుంటే.. అంతే పారితోషకం వచ్చేదన్నారు. ఎక్కడైతే తృప్తి లేదో.. అక్కడ సంతోషం ఉండదన్నారు.

ప్రేక్షకులకు ప్రత్యుపకారం ఏమి చేశామా ? అని ఆలోచించాలన్నారు. అందుకే సేవా కార్యక్రమాలకు నడుం బిగించానన్నారు. వాళ్ల కోసం, సినిమా ప్రేక్షకుల కోసమే బ్లడ్ బ్యాంక్ స్థాపించినట్లు వెల్లడించారు. చేయూతనిచ్చే విధంగా టీఎస్ఏ (TCA) కార్యక్రమాలు చేస్తుండడం అభినందనీయమన్నారు. చిత్రపురి కాలనీలో ఓ హాస్టల్ కట్టాలని ఒక ఆలోచన వచ్చిందని.. సినీ వర్కర్స్ కు ఉపయోగపడే విధంగా ఉంటుందని ఆశిస్తున్నట్లు తెలిపారు. హాస్పిటల్ కి రూ. 20 లక్షల చెక్ ని TCA అందించారన్నారు. ఈస్ట్ వెస్ట్ ఆర్గనైజర్స్ కు అభినందనలు తెలియచేస్తున్నట్లు తెలిపారు. పెద్ద పెద్ద పబ్లిసిటీ తనకు అవసరం లేదని.. తాను ఏ కార్యక్రమం చేసినా.. తన స్టైల్లో చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో... టాలీవుడ్ సెలెబ్రెటీలు ప్రకాష్ రాజ్, శ్రీకాంత్, సుధీర్ బాబు, తరుణ్, థమన్, తదితరులు పాల్గొన్నారు. సెప్టెంబర్ 24న డల్లాస్ లో యూనివర్సల్ ఎలెవన్ జట్టుతో TCA టీమ్ తలపడనుంది.