మా వదినమ్మ వచ్చేసింది.. నిహారిక పోస్ట్ వైరల్

మా వదినమ్మ వచ్చేసింది.. నిహారిక పోస్ట్ వైరల్

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్(Varun tej)-లావణ్య(Lavanya) నవంబర్ 1న మూడుముళ్ల బంధంతో ఒకటయ్యారు. గత ఆరు సంవత్సరాలుగా ప్రేమలో ఉన్న ఈ జంట.. తాము మొదటిసారి కలుసుకున్న ప్రదేశం ఇటలీలో డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకున్నారు. ఎంతో ఘనంగా జరిగిన ఈ పెళ్లి వేడుకలకు మెగా ఫ్యామిలీతో పాటు అత్యంత సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు. ఈ పెళ్లికి సంబంధించిన ఫొటోలు కూడా నెట్టింట వైరల్‌గా మారాయి. 

అయితే  తాజాగా మెగా డాటర్ నిహారిక తన ఇన్‌స్టాగ్రామ్‌లో తన అన్నా వదినతో కలిసి దిగిన పిక్ ను షేర్ చేసింది. ఆ ఫొటోకు.. వదినమ్మ వచ్చేసింది’’ అనే క్యాప్షన్ యాడ్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇది చూసిన నెటిజన్స్ ఫోటో చాలా క్యూట్ గా ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు.  

ALSO READ :వ్యూహం రిలీజ్ వాయిదా !.. కోర్టుకి వెళ్తానన్న వర్మ