
వ్యూహం (Vyuham ) సినిమాపై సెన్సార్ బోర్డు అభ్యంతరం తెలపడంపై ఆ చిత్ర దర్శకుడు ఆర్జీవీ స్పందించారు. దీనిపై తాము రివైజింగ్ కమిటీకి ఫిర్యాదు చేశామన్నారు. కమిటీ నిర్ణయం అనంతరం ఏం చేయాలో ఆలోచిస్తామన్నారు. ప్రస్తుతానికి అయితే సినిమా రిలీజ్ డేట్ ను వాయిదా వేస్తున్నామని తెలిపారు. వ్యూహం సినిమాను ఆపేయాలని నారా లోకేష్ సెన్సార్ బోర్డుకు లేఖ రాశారని సోషల్ మీడియాలో సర్క్యూలేట్ అవుతుందని చెప్పారు ఆర్జీవీ. కానీ సెన్సార్ బోర్డు ఆ లేఖను తనకు చూపించలేదన్నారు.
కాగా వ్యూహం సినిమా రాజకీయ వివాదాలను సృష్టించేలా ఉందంటూ సెన్సార్ బోర్డు అభ్యంతరం వ్యకం చేసింది. సినిమాలోని పాత్రలు నిజజీవిత వ్యక్తులను ప్రభావితం చేసేలా ఉన్నాయని, పేర్లు కూడా అవే ఉండటంతో సెన్సార్ బోర్డు అభ్యంతరం వ్యకం చేసింది. దీనిపై రివైజింగ్ కమిటీకి వెళ్లాలని సూచించింది. అయితే రివైజింగ్ కమిటీ కూడా సినిమాపై అభ్యంతరం వ్యక్తం చేస్తే ఉడ్తా పంజాబ్, పద్మావతి సినిమాలు లాగా కోర్టుకు వెళ్తానన్నారు ఆర్జీవీ.
అరచేతిని అడ్డుపెట్టి సూర్య కాంతిని ఆపలేరు???
— Ram Gopal Varma (@RGVzoomin) November 2, 2023
ఎన్ని వ్యూహాలు పన్నినా మా " వ్యూహం" నీ ఆపలేరు ?????? pic.twitter.com/oCnn5tsuTf
దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి(YS Rajashekhara reddy) మరణాంతరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏర్పడ్డ పరిస్థితుల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు ఆర్జీవీ. వ్యూహం,శపధం(Shapadam) అనే భాగాలుగా తెరకెక్కుతున్న ఈ సినిమా మొదటి భాగం వ్యూహం నవంబర్ 10న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు ఇప్పటికే ప్రకటించాడు దర్శకుడు ఆర్జీవీ.