ముషీరాబాద్, వెలుగు: తమ విద్యార్థుల కోసం కాకా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కాలేజీ మేనేజ్మెంట్ గురువారం మెగా జాబ్ మేళాను నిర్వహించింది. బాగ్ లింగంపల్లిలోని కాలేజీ క్యాంపస్లో గురువారం జరిగిన ఈ ఈవెంట్లో టెక్ మహీంద్రా, కార్లోస్ డేటా సెంటర్, ఐఐసీ టెక్నాలజీస్, ఐఎంసీ డిజిట్, క్లౌడ్ బాక్స్ 99, ఏటీసీ, హెట్రో వంటి 38కి పైగా టాప్ కార్పొరేట్ కంపెనీలు పాల్గొన్నాయి.
ఈ మేళాలో డిగ్రీ, ఎంబీఏ, పీజీ చదువుతున్న స్టూడెంట్లతో పాటు పూర్వ విద్యార్థులు 300 మందికి పైగా ఇంటర్వ్యూలకు అటెండ్ అయ్యారు. ఇంటర్వ్యూలో ఎలా పర్ఫార్మ్ చేయాలో ముందే ట్రైనింగ్ ఇవ్వడం వల్ల చాలా కాన్ఫిడెంట్గా ఉండగలిగామని విద్యార్థులు తెలిపారు. చదువు పూర్తి కాకముందే ఆఫర్ లెటర్లు రావడం చాలా హ్యాపీగా ఉందన్నారు.
అంబేద్కర్ కాలేజీ స్టూడెంట్లలో మంచి స్కిల్స్ ఉన్నాయని, ఫ్రెషర్లను తీసుకోవడం తమకు సంతోషంగా ఉందని కంపెనీ ప్రతినిధులు తెలిపారు.
